మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలను విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘మంచు విష్ణు’ బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చే సరికి, ప్రకాశ్ రాజ్ ఇప్పటి నుండే పోటీకి సన్నద్ధం అవుతున్నాడు. నిజానికి ‘మా’ ఎన్నికలకు ఇంకా చాలా టైముంది. అయితే, ప్రకాష్ రాజ్ మాత్రం తెగ దూకుడు మీదున్నాడు.
తన ప్యానెల్ కి కావాల్సిన వారిని అప్పుడే షార్ట్ లిస్ట్ చేశాడు. తాజాగా సిని’మా’ బిడ్డలం అంటూ తనదైన శైలిలో భావుకతను చూపిస్తూ 27 మందితో కూడిన ప్యానెల్ ని ప్రకటించాడు. కాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో హీరో శ్రీకాంత్, హీరోయిన్ జయసుధ, నటుడు బ్రహ్మాజీ, హాట్ బ్యూటీ అనసూయ, విలన్ అజయ్ వంటి వారు ఉన్నారు.
ఇందులో 18 మంది పోటీలో ఉన్నారు. ‘పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం.. ‘మా’ టీం రాబోతుంది’ అని మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు ప్రకాష్ రాజ్.
1. ప్రకాష్‌రాజ్
2. సహజ నటి జయసుధ
3. హీరో శ్రీకాంత్
4. నటుడు బెనర్జీ
5. సాయికుమార్
6. తనీష్
7. ప్రగతి
8. అనసూయ
9. సన
10. అనిత చౌదరి
11. సుధ
12. అజయ్
13. నాగినీడు
14. బ్రహ్మాజీ
15. రవిప్రకాష్
16. సమీర్
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్
20. శివారెడ్డి
21. భూపాల్
22. టార్జాన్
23. సురేష్ కొండేటి
24. ఖయ్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవిందరావు
27. శ్రీధర్‌రావు