https://oktelugu.com/

సీనియర్ సిటిజన్స్ కు 5 అదిరిపోయే స్కీమ్స్.. రిస్క్ లేకుండా ఎక్కువ రాబడి..?

రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లకు ఐదు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఈ ఆప్షన్లు అనువుగా ఉంటాయని చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్స్ కు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. 15 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తుండగా ఈ స్కీమ్ మెచ్యూరిటీ గడువు ఐదేళ్లుగా ఉంది. సీనియర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 24, 2021 / 05:20 PM IST
    Follow us on

    రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లకు ఐదు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఈ ఆప్షన్లు అనువుగా ఉంటాయని చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్స్ కు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. 15 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తుండగా ఈ స్కీమ్ మెచ్యూరిటీ గడువు ఐదేళ్లుగా ఉంది.

    సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీస్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఉండగా గరిష్టంగా జాయింట్ అకౌంట్ మీద రూ.9 లక్షల వరకు సింగిల్ అకౌంట్ అయితే రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో 6.6 శాతం వడ్డీ పొందే అవకాశం ఉండగా ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా డబ్బులు పొందవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ కూడా సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనకరంగా ఉంటుంది.

    ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తుండగా రూ.15 లక్షల వరకు డబ్బులు దాచుకునే అవకాశం ఉంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ గడువు పది సంవత్సరాల వరకు ఉంటుంది. ఫ్లోటింగ్ రేటు సేవింగ్స్ బాండ్లలో కూడా సీనియర్ సిటిజన్లు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ బాండ్ల టెన్యూర్ 7 ఏళ్లు కాగా వడ్డీరేటు ఆరు నెలలకు ఒకసారి మారుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.15 శాతం వడ్డీ రేటు లభిస్తుండటం గమనార్హం.

    బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ లభిస్తుంది. 5 నుంచి పదేళ్ల కాల పరిమితిలో డబ్బులు పెడితే బ్యాంకులు ప్రత్యేక స్కీమ్స్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్స్ ద్వారా 7 శాతానికి పైగా వడ్డీ పొందవచ్చు.