సినిమా ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్ చేసి.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యింది అనసూయ. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు వెండితెరపై ప్రధాన పాత్రలు పోషించే స్థాయికి చేరింది. అనసూయ తమ సినిమాలో ఉంటే మంచి క్రేజ్ వస్తుందని మేకర్స్ ఫీలయ్యే వరకూ వచ్చింది ఈ అమ్మడి స్టార్ డమ్. అయితే.. తాజాగా స్టేజ్ పైనే ఓ పాటల రచయిత ఆమెను టచ్ చేయడంతో అందరూ షాకయ్యారు.
Also Read: టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోలు వీరే..
మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన హాట్ బ్యూటీ.. ఆ తర్వాత ‘క్షణం’, ‘కథనం’ వంటి సినిమాలతో లీడ్ రోల్ కూడా పోషించింది. అంతేకాదు.. ఇప్పుడు ఔటాఫ్ టాలీవుడ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమైందీ బ్యూటీ. ఇప్పటికే తన కోలీవుడ్ డెబ్యూ మూవీకి సైన్ చేసింది. మమ్ముట్టి సినిమాతో మలయాళంలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక తెలుగులో చాలా సినిమాలు అమ్మడి కిట్ లో ఉన్నాయి.
కృష్ణవంశీ ‘రంగమార్తాండ’, సునీల్ ‘వేదాంతం రాఘవయ్య’, రవితేజ ‘ఖిలాడీ’తోపాటు పలు సినిమాల్లో నటిస్తోంది. పవన్-క్రిష్ సినిమాలోనూ కీలక పాత్రపోషిస్తోందని టాక్. వీటితోపాటు ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో ప్రత్యేక పాటలోనూ చిందేసింది. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఇందులో ‘పైన పటారం.. లోన లొటారం’ అనే పాటకు తెగ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అనసూయతోపాటు ‘పైన పటారం.. లోన లొటారం’ అన పాట రాసిన సత్యనారాయణ రెడ్డి అనే యువకుడు కూడా హాజరయ్యాడు. ఇతడి వయసు పదహారేళ్లు కావడం విశేషం. అయితే.. ఈ వేడుకలో సత్యనారాయణ రెడ్డిని మాట్లాడమని యాంకర్ సుమ కోరగా.. అతడు నేరుగా వెళ్లి అనసూయ కాళ్లు పట్టుకున్నాడు. దీంతో.. అక్కడున్న వారంతా చూసి షాకయ్యారు.
Also Read: చిరంజీవి ‘ఆచార్య’ గురించి షాకింగ్ న్యూస్
ఆ తర్వాత తాను అలా ఎందుకు చేశానో చెప్పాడా యువకుడు. తనకంటే పెద్దవారు కాబట్ట అలా చేశానని చెప్పడంతో.. సుమ స్పందిస్తూ.. ‘‘అయితే.. అనసూయ ఆంటీనా?’’ అన్నది. దీంతో.. అనసూయ వెళ్లి సుమ కాళ్లకు దండం పెట్టింది. సత్యానారాయణ మళ్లీ క్లారిటీ ఇస్తూ.. తాను దండం పెట్టింది వయసు కాదని, అనుభవానికి అని చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్