https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ప్రేమ కోసం పరితపించే ‘శశి’

సాయికుమార్ తనయుడు ‘ఆది’ హీరోగా తెరకెక్కిన మూవీ ‘శశి’. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. టీజర్ ఆకట్టుకుంటోంది. తన ప్రియురాలిని పిచ్చిగా ప్రేమించే.. స్నేహానికి ప్రాణమిచ్చే యువకుడి పాత్రలో హీరో ఆది నటించారు. కొన్ని కారణాల వల్ల అతని స్నేహితురాలు అతన్ని వదిలేయడంతో ప్రేమపై కోపంతో ఇక దానికి ద్వేషిగా హీరో మారుతాడు. చాలా ప్రేమకథల్లో మాదిరిగా […]

Written By: , Updated On : March 10, 2021 / 10:52 AM IST
Follow us on

సాయికుమార్ తనయుడు ‘ఆది’ హీరోగా తెరకెక్కిన మూవీ ‘శశి’. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. టీజర్ ఆకట్టుకుంటోంది.

తన ప్రియురాలిని పిచ్చిగా ప్రేమించే.. స్నేహానికి ప్రాణమిచ్చే యువకుడి పాత్రలో హీరో ఆది నటించారు. కొన్ని కారణాల వల్ల అతని స్నేహితురాలు అతన్ని వదిలేయడంతో ప్రేమపై కోపంతో ఇక దానికి ద్వేషిగా హీరో మారుతాడు. చాలా ప్రేమకథల్లో మాదిరిగా హీరోయిన్ సురభి తండ్రి వీరి ప్రేమకథకు అడ్డంకిగా ఉంటాడు.

ట్రైలర్‌ చూస్తే ఇదో మంచి ప్రేమకథగా కనిపిస్తోంది. సరదాగా సాగింది. అద్భుతమైన డైలాగులు, యాక్షన్ ఉన్నాయి. విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో ఆది నటించినట్లు కనిపిస్తోంది. ఆది ప్రేమలో ఉన్నప్పుడు కూల్ గా కనిపిస్తున్నాడు. అతడిని ప్రియురాలు విడిచిపెట్టినప్పుడు కర్కషంగా మారిన యువకుడిగా కనిపిస్తున్నాడు.

అరుణ్ చిలువేరు అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ గా కనిపిస్తోంది. ఇందులోని ‘ఓకే ఓక లోకం’ పాట అప్పటికే అద్భుతమైన ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఇది యువ ప్రేక్షకులను ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది..

శ్రీనివాస్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ నిర్మించారు. శశి ఈనెల 19 న విడుదల కానుంది.

#Sashi Official Trailer | Aadi, Surbhi Puranik | Srinivas Naidu Nadikatla | Arun Chiluveru