https://oktelugu.com/

L2 Empuraan : మోహన్ లాల్ చేస్తున్న ‘ఎల్ 2 ఎంపురన్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచేశారుగా…

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నా కొంతమందికి మాత్రం చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంటుంది. ఎందుకంటే వాళ్లు చేసే ప్రతి పాత్ర కూడా ప్రత్యేకంగా నిలవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ఆ పాత్రలు చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటాయి...

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2024 / 08:48 PM IST

    Lyca Productions' L2 Empuraan to be released worldwide on March 27, 2025

    Follow us on

    L2 Empuraan : మలయాళం సినిమా ఇండస్ట్రీలో కంప్లీట్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు నటుడిగా అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం… ఇక ఇంతకుముందు ఆయన పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ‘లూసిఫర్’ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎల్ 2 ఎంపురన్ ‘ అనే సినిమా తెరకెక్కుతుంది. లైకా మూవీ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న నేపధ్యంలో మొదటి పార్ట్ కు దర్శకత్వం వహించిన ‘పృథ్విరాజ్ సుకుమారన్ ‘ ఈ సినిమాని మరోసారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ ఎలివేషన్స్ ను ఇస్తూ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను చాలా బాగా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ సినిమా డేట్ ని కూడా అనౌన్స్ చేశారు… ఇక పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పూర్తి అటెన్షన్ ని మైంటైన్ చేస్తుంది…

    ఫైర్ లో నుంచి వైట్ షర్ట్ లో ఉన్న మోహన్ లాల్ వెనక్కి తిరిగి ఉన్న షార్ట్ ని రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి. ఇక ఈ ఒక్క పోస్టర్ తో సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేయడమే కాకుండా సినిమాలో భారీ ఎలివేషన్ షాట్స్ కూడా ఉండబోతున్నాయి అనే విషయాన్ని చెపక్కనే చెప్పారు…

    ఇక ఏది ఏమైనా కూడా పృధ్విరాజ్ సుకుమారన్ లాంటి ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కంప్లీట్ యాక్టర్ అయిన మోహన్ లాల్ ని డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి రిపీట్ చేసి మోహన్ లాల్ కెరియర్ లోనే ది బెస్ట్ హిట్ సినిమాను ఇవ్వడానికి ఆయన భారీగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాని మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…

    ఇప్పటికే పృధ్విరాజ్ సుకుమారన్ చేస్తున్న జయేద్ మసూద్ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అది కూడా చాలా హైలెట్ గా ఉండడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో మంజు వారియర్, టోవినో థామస్, సానియా అయప్పన్, నందు నటిస్తున్నారు…