https://oktelugu.com/

Vikkatakavi : మొట్టమొదటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ డిటెక్టివ్ వెబ్ సిరీస్ గా రాబోతున్న ‘వికటకవి’..ఎందులో చూడాలంటే!

ఇప్పుడు 'వికటకవి' వెబ్ సిరీస్ 701 వ ఒరిజినల్ కంటెంట్ గా జీ5 లో అప్లోడ్ కాబోతుంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ తెలంగాణ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేరకు అలరిస్తుందో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2024 8:32 pm

    ZEE5 Original series "Vikkatakavi" release date Announcement

    Follow us on

    Vikkatakavi : ఈమధ్య కాలంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ ని ఆధారంగా చేసుకొని సినిమాలు రావడం మన టాలీవుడ్ లో ఎక్కువ అయిపోయాయి. ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ ఎక్కువ శాతం సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే మొట్టమొదటిసారిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక డిటెక్టివ్ వెబ్ సిరీస్ మన ముందుకు రాబోతుంది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘వికటకవి’. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 28 వ తారీఖు నుండి తెలుగు, తమిళ భాషల్లో జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైన రామ్ తల్లూరి ఈ వెబ్ సిరీస్ ని నిర్మించగా, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు.

    ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ విషయానికి వస్తే హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల్ల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ఊరికి సంబంధించిన కథగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఆ ప్రాంతంలోని ప్రజలు 30 ఏళ్లుగా ఒక శాపం కారణంగా అష్ట కష్టాలను ఎగురుకుంటూ ఉంటారు. అనేకమంది ప్రజలు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటారు. అసలు ఈ ప్రాంతంలో ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి?, నిజంగానే ఈ ప్రాంతం శాపగస్త్రమైందా?, లేదా శాపం పేరుతో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారా అనే విషయాన్ని ఛేదించడానికి డిటెక్టివ్ రామకృష్ణ వస్తాడు. ఆ గ్రామానికి సంబంధించినా పురాతన కథలను పరిశీలించి, ఈ కుట్రల వెనుక దాగుంది ఎవరో కనుక్కునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయాణంలో తనకి ఎన్నో అవాంఛనీయ సంఘటనలు ఎదురు అవుతాయి. ఊహించని ట్విస్టులు కూడా ఉంటాయి, అవి ఏమిటి అనేది తెలియాలంటే నవంబర్ 28 వరకు ఆగాల్సిందే. ఈ వెబ్ సిరీస్ కి అజయ్ అరసాడ సంగీతం అందించగా, షోయబ్ సిద్దికీ సినిమాటోగ్రఫీ అందించాడు.

    ఇది ఇలా ఉండగా ఇటీవల కాలం లో జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్, సినిమాలను అందించడంలో దేశంలోనే అగ్రస్థానం ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సరికొత్త కంటెంట్స్ తో అలరిస్తూ మిలియన్ల కొద్దీ యూజర్లను సంపాదించుకుంది ఈ ప్లాట్ ఫార్మ్. ఇప్పటి వరకు ఈ యాప్ లో 3500 సినిమాలు, 1750 టీవీ షోలు, 700 కి పైగా ఒరిజినల్ వెబ్ సిరీస్లు, సినిమాలు, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఇందులో అందుబాటులో ఉంది. 12 భాషలకు సంబంధించిన సినిమాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ‘వికటకవి’ వెబ్ సిరీస్ 701 వ ఒరిజినల్ కంటెంట్ గా జీ5 లో అప్లోడ్ కాబోతుంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ తెలంగాణ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేరకు అలరిస్తుందో చూడాలి.