Lucky Bhaskar Collections : ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి మలయాళం హీరో నటించిన ‘లక్కీ భాస్కర్’. ‘సీతారామం’ చిత్రంతో తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరో గా నటించిన రెండవ సినిమా ఇది. మొదటి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, రెండవ సినిమా అంతకంటే పెద్ద హిట్ అయ్యింది. ఇటీవలే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కూడా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తుంది. ‘పుష్ప 2’ విడుదల అయ్యినప్పటికీ కూడా ఈ సినిమా పలు థియేటర్స్ లో రన్ అవుతుంది అంటే, ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లాంగ్ రన్ వచ్చిన సినిమాని మనం చూసుండము ఏమో. అలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం.
అయితే ఎట్టకేలకు దాదాపుగా థియేట్రికల్ రన్ ని ముగించుకున్న ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి విడుదలకు ముందు 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విడుదల తర్వాత 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 38 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనలేము కానీ, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా మాత్రం సెన్సేషనల్ అనే చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడు లో ఈ చిత్రం ఒక సునామి సృష్టించిందనే చెప్పాలి. అక్కడ ఈ చిత్రానికి దాదాపుగా 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి కూడా ఈ రేంజ్ వసూళ్లు ఈ ప్రాంతం లో రాలేదు. ‘పుష్ప 2’ విడుదల కాకపోయుంటే మరో రెండు వారాలు థియేటర్స్ లో నడిచేది ఈ చిత్రం.
ఇక దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీ అయినటువంటి మాలీవుడ్, అనగా కేరళలో 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక్కడ కల్కి చిత్రానికి కూడా ఫుల్ రన్ లో ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. అదే విధంగా కర్ణాటకలో 7 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, రెస్ట్ ఆఫ్ ఇండియా లో రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఏకంగా 28 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఓవరాల్ గా 113 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా కి 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా దుల్కర్ నటించిన రెండు సినిమాలు తెలుగులో పెద్ద హిట్ అవ్వడంతో, త్వరలోనే ఆయన శేఖర్ కమ్ముల తో కలిసి మూడవ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.