Pushpa 2 Movie : నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాత్మక ఓపెనింగ్స్ ని దక్కించుకుందో మన కళ్లారా చూసాము. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన ట్రేడ్ పండితులు సైతం విస్తుపోయే రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. కేవలం వీకెండ్ లోనే 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. తెలుగు ఆడియన్స్ కంటే హిందీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి మెంటలెక్కిపోతున్నారు. ముఖ్యంగా జాతర సన్నివేశం కోసం వాళ్ళు రెండు మూడు సార్లు రిపీట్స్ లో చూసే పరిస్థితులు కూడా ఉన్నాయి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో కేవలం బాలీవుడ్ నుండే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
విడుదలకు ముందు నుండే ఈ సినిమాకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకు ఉదాహరణ బీహార్ లో జరిపిన ప్రీ రిలీజ్ ఈవెంటే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. నేషనల్ వైడ్ గా ఆ ఈవెంట్ కి వచ్చిన జనాలు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి అంతటి క్రేజ్ రావడానికి కారణం ముమ్మాటికీ అల్లు అర్జునే. పుష్ప గా ఆయన చూపించిన యాటిట్యూడ్, మ్యానరిజమ్స్ కి అక్కడి ఆడియన్స్ మెంటలెక్కిపోయారు. కేవలం బాలీవుడ్ ఆడియన్స్ కి మాత్రమే కాదు, టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ‘తగ్గదేలే’ మ్యానరిజం ఒక అలవాటు అయిపోయింది. మన రోజువారీ జీవితంలో, ఎదో ఒక సందర్భంలో ఈ మ్యానరిజం ని వాడుతుంటాము. అంతలా జనాలకు అలవాటు అయిపోయింది. అయితే మ్యానరిజంని అల్లు అర్జున్ తో చేయించాలని వచ్చిన ఐడియా కచ్చితంగా సుకుమార్ ది అయితే కాదట.
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఆలోచన అట. ఈ క్యారక్టర్ కి ఈ మ్యానరిజం పెడితే అదిరిపోతుందని, ఈ డైలాగ్ నేనే బన్నీ కి రెఫెర్ చేసానని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు . ఇదేదో బాగుందే, ఒకసారి సుకుమార్ కి చెపుదాం అని సుకుమార్ కి చెప్పగానే ఆ ఐడియా ఆయనకీ కూడా తెగ నచ్చేసింది. అలా పుష్ప క్యారక్టర్ కి తగ్గేదేలే మ్యానరిజాన్ని జత చేసారు మేకర్స్. ఇక ఆ తర్వాత హిస్టరీ మీ అందరికీ తెలిసిందే. పార్ట్ 2 కి ఈ రేంజ్ క్రేజ్, హైప్ రావడానికి కూడా కారణం ఈ డైలాగ్ మ్యానరిజం అని అంటున్నారు అభిమానులు. ఆ లెక్కన దీనికి క్రెడిట్ కచ్చితంగా హరీష్ శంకర్ కి ఇవ్వాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఎలాంటి మ్యానరిజమ్స్ చెయ్యిస్తాడో చూడాలి.