https://oktelugu.com/

Lucky Bhaskar collections : రోజురోజుకి పడిపోతున్న ‘లక్కీ భాస్కర్’ వసూళ్లు..5వ రోజు మరీ ఇంత తక్కువనా?..ఇలా అయితే కష్టమే!

ముందు రోజుతో పోలిస్తే దాదాపుగా 70 శాతం వసూళ్లు తగ్గిపోయాయి అన్నమాట. ఈ స్థాయి డ్రాప్స్ ఉంటే లాంగ్ రన్ ఉండడం కష్టం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే 5 రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు ప్రాంతాల వారీగా వివరంగా చూద్దాము.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 07:50 PM IST

    Lucky Bhaskar collections

    Follow us on

    Lucky Bhaskar collections : వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. అయితే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తెలుగులో దుల్కర్ సల్మాన్ రేంజ్ కి మించి చేశారేమో, సూపర్ హిట్ అయినా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ సీడెడ్ లో తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది. కానీ రోజు రోజుకి కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. A సెంటర్స్ లో వచ్చినంత వసూళ్లు, మాస్ సెంటర్స్ లో రాకపోవడమే అందుకు కారణం. నాల్గవ రోజు 2 కోట్ల 90 లక్షల రూపాయిలను రాబట్టిన ఈ సినిమా, 5వ రోజు కేవలం కోటి రూపాయలకు మాత్రమే పరిమితం అయ్యింది.

    అంటే ముందు రోజుతో పోలిస్తే దాదాపుగా 70 శాతం వసూళ్లు తగ్గిపోయాయి అన్నమాట. ఈ స్థాయి డ్రాప్స్ ఉంటే లాంగ్ రన్ ఉండడం కష్టం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే 5 రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు ప్రాంతాల వారీగా వివరంగా చూద్దాము. నైజాం లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 6 కోట్ల 50 లక్షల రూపాయిలు వచ్చాయి. ఈ వీకెండ్ తో 10 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా సీడెడ్ లో కోటి 50 లక్షలు రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రదేశ్ లో 4 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కి మరో రెండు కోట్ల 20 లక్షలు రాబట్టాలి.

    ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కేరళ లో 10 కోట్ల రూపాయిలు, కర్ణాటక లో 3 కోట్ల రూపాయిలు, తమిళనాడులో 4 కోట్ల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి 5 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో 15 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ 5 రోజులకు కలిపి 53 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 26 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా, మరో కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను బ్రేక్ ఈవెన్ కోసం రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం 70 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో మరో పది కోట్లు రాబట్టొచ్చు కానీ, వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రం అందుకోవడం ప్రస్తుతానికి అసాధ్యం.