SBI Account Holders : నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు వ్యవహారంతో సంబంధాన్ని కలిగి ఉంటున్నారు. ముఖ్యంగా మొబైల్ తో బ్యాంకు లింక్ అయి ఉండడంతో ఉన్న చోట నుంచే ఆర్థిక వ్యవహారాలు జురుపుతున్నారు. అయితే చాలా మంది డిజిటల్ పేమెంట్స్ కు అలవాటు పడడంతో కొందరు సైబర్ నేరగాళ్లు మొబైల్ ను హ్యాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వివిధ పద్దతుల ద్వారా మొబైల్ హ్యాంకింగ్ చేసి బ్యాంకు అకౌంట్ నుంచి నగదును మాయం చేసిన సంఘటనలు వెలుగు చేశాం. అయితే బ్యాంకు వినియోగదారులకు అవగాహన పెరుగుతుండడంతో హ్యాకర్లు కూడా కొత్త పద్ధతిలో మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా నూతన పద్ధతితో హ్యాక్ చేస్తున్నట్లు ప్రముఖ బ్యాంకు State Bank Of India గుర్తించింది. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు కొన్ని మెసేజ్ లు పంపించింది. ఆ వివరాల్లోకి వెళితే..
దేశంలో నెంబర్ వన్ బ్యాంకుల్లో State Bank Of India (SBI) ఒకటి . ఈ బ్యాంకు ద్వారా కోట్ల మంది వినియోగదారులు ఆర్థిక వ్యవహారాలు జరుపుతూ ఉంటారు. మనీ ట్రాన్స్ ఫర్ తో పాటు ఇతర చెల్లింపులుల ఎస్బీఐ ద్వారానే చెల్లిస్తారు. ఈ బ్యాంకుతో ఫోన్ పే, గూగుల్ పే ఇతర థర్డ్ పార్టీలతో పాటు బ్యాంకకు చెందిన YONO యాప్ ద్వారా పేమెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వినియోగదారుకు వివిధ రకాలా మెసేజ్ లు వస్తుంటాయి. అయితే కొంతమంది వినియోగదారులు కొత్త రకమైన మెసేజ్ లు అందుకున్నట్లు ఎస్బీఐకి ఫిర్యాదులు వచ్చాయి.
కొంత మంది ఖాతాదారులకు .apk పేరిట కొన్ని మెసేజ్ లు వస్తున్నాయి. ఈ మెసెజ్ పై క్లిక్ చేయగానే నేరుగా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు మాయం అవుతుంది. అయితే ముందుగా వినియోగదారులను ఆకర్షించడానికి తమకు Reward Points వచ్చాయని మెసెజ్ లు పంపిస్తున్నారు. ఆ తరువాతల సైబర్ నేరగాళ్లు తమకు చెందిన బ్యాంకు నెంబర్లతో ఖాతా లింక్ అయి చివరకు .apk అని ఉంటుంది. దీంతో ఈ లింక్ ను క్లిక్ చేయడం వల్ల ఖాతాదారుని బ్యాంకుతో లింక్ అయి డబ్బు మాయం అవుతుంది.
ఈ నేపథ్యంలో State Bank Of India (SBI) ఖాతాదారులను హెచ్చరించింది. బ్యాంకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ప్రకటించినా నేరుగా దగ్గర్లోని బ్రాంచ్ లో కలవాలని సూచించింది. అంతేకాకుండా ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ను ఆన్ లైన్ లో క్లెయిమ్ చేసుకోవాలని తెలపదని పేర్కొంది. ఇలాంటి మెసెజ్ లు వస్తే స్పందించొద్దని, ఇవి హ్యాకర్లు పంపిస్తున్నారని పేర్కొంది. అందువల్ల ఇలాంటి మెసేజ్ లకు ఏ విధంగానూ స్పందించొద్దని తెలిపింది. అయితే ఇలాంటివి మాత్రమే కాకుండా బ్యాంకుకు సంబంధించి ఎలాంటి మెసేజ్ వచ్చినా దగ్గర్లోని బ్రాంచ్ ను సంప్రదించాలని పేర్కొంది.
ప్రతిరోజూ కోట్ల మంది ప్రతిరోజూ ఎస్బీఐ బ్యాంకు ద్వారా ఆర్థిక వ్యవహారాలు జరుపుతూ ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు పాస్ వర్డ్ ను మార్చుకుంటూ ఉండాలని అన్నారు. అంతేకాకుండా బ్యాంకుకు సంబంధించిన రివార్డ్ పాయింట్స్ గురించి యోనో యాప్ లో డిటేయిల్స్ ఉంటాయని బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు.