Lokesh Kanagaraj : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ‘లోకేష్ కనకరాజు'(Lokesh Kanakaraj)… కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ (Vikram) సినిమాతో తనకంటు ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక అలాగే ఆ సినిమా విజయంలో ఆయన కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. ప్రతి సీన్ లో తన మార్క్ కనిపించేలా మేకింగ్ లో దమ్ము చూపిస్తూ ముందుకు దూసుకెళ్లే ఏకైక దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావడం విశేషం. ప్రతి షాట్ కూడా చాలా కొత్త గా ఉండే విధంగా డిజైన్ చేసుకుంటాడు. అందుకే ఆయన సినిమాలకు ఎక్కువగా క్రేజ్ అయితే లభిస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఖైదీ(Khaid), విక్రమ్ (Vikram) సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ (Cooli) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రజనీకాంత్ ను చాలా పవర్ ఫుల్ పర్సన్ గా చూపించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా మెగాస్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి గారితో సైతం ఆయన ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట.
Also Read : లోకేష్ కనకరాజ్ సుకుమార్ ఇద్దరిలో టాప్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
తొందర్లోనే ఈ సినిమా తెరమీదకి రాబోతుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…అయితే ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ (Vishvambhara) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా ముగిసిన వెంటనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. మరి ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత లోకేష్ సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక లోకేష్ చిరంజీవిని డాన్ పాత్రలో చూపించాలనే ప్రయత్నమైతే చేస్తున్నారట.
మరి దానికి చిరంజీవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కొంతమంది అంటుంటే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనే దానిమీద సరైన క్లారిటీ రావడం లేదు అంటూ మరి కొంతమంది కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అందుతున్న సమాచారం ప్రకారం అయితే చిరంజీవి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇప్పటికే కమల్ హాసన్(Kamal Hasan) కి భారీ సక్సెస్ ని అందించిన లోకేష్ ఇప్పుడు రజినీకాంత్ కి కూడా అదే రేంజ్ లో సక్సెస్ ని కట్టబెట్టాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. కూలీ సినిమా కూడా సక్సెస్ అయితే మాత్రం చిరంజీవి అతన్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…
Also Read : లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయడానికి భయపడుతున్న తెలుగు హీరోలు కారణం ఏంటంటే..?