SVSC Re Release: మన టాలీవుడ్ లో మల్టీస్టార్రర్ ట్రెండ్ కి ఆజ్యం పోసిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(Seethamma Vaakitlo Sirimalle Chettu). శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో మహేష్ బాబు(Superstar Mahesh Babu), వెంకటేష్(Victory Venkatesh) కాంబినేషన్ లో 2013 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వడమే కాదు, మంచి క్లాసిక్ చిత్రం గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని చూస్తున్నంతసేపు మనకు మన ఇంటి కుటుంబ సంబంధాలే గుర్తుకు వస్తాయి. అంత అద్భుతంగా, సహజంగా ఉండేలా ఈ సినిమాని తీర్చి దిద్దాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. రీసెంట్ గానీ ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తే మరోసారి ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. దాదాపుగా 5 కోట్ల 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసింది ఈ చిత్రం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమాకు సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నామని, కానీ ఇందులో హీరోలుగా మహేష్ బాబు, వెంకటేష్ ఉండరని చెప్పుకొచ్చాడు. నేటి తరం యూత్ హీరోలతో ఈ మల్టీస్టార్రర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ కలిసి ఈ మల్టీస్టార్రర్ చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చలు కూడా సోషల్ మీడియా లో జరుగుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న మల్టీస్టార్రర్ ట్రెండ్ లో నిర్మాతలు, దర్శకులు గట్టిగా తల్చుకోవాలే కానీ, ఎలాంటి కాంబినేషన్ ని అయినా సెట్ చేసేయొచ్చు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి సమకాలీన హీరోలే కలిసి సినిమా చేసినప్పుడు, ఇక మిగిలిన హీరోల కాంబినేషన్స్ ని సెట్ చేయడం అంత కష్టమైన పని కాదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.