Lokesh Kanagaraj vs Sukumar: సినిమాలు తీయడంలో దర్శకుల మధ్య మంచి పోటీ అయితే ఉంటుంది. అయితే ఒక దర్శకుడు ఒక జానర్ లో సినిమాలు చేస్తే మరొక దర్శకుడు ఇంకో జానర్ లో సినిమాలు చేసి మంచి సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలో కొంతమంది డైరెక్టర్ల మధ్య మంచి పోటీ ఉండటమే కాకుండా వాళ్ళ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ గా పేరుపొందిన సుకుమార్(Sukumar) వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇదే క్రమంలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఈయన కమలహాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. అయితే లోకేష్ కనకరాజ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో విక్రమ్ సినిమా ఒకటి…ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ సినిమా తర్వాత ఖైదీ సినిమా కూడా లోకేష్ కు ఒక మంచి హిట్టయితే తీసుకొచ్చింది. ఆయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఆయన వైవిధ్యమైన కథాంశంతో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమాలు చేస్తాడు అనే పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక దానివల్లనే ఆయన ఇండస్ట్రిలో చాలా సంవత్సరాల పాటు కొనసాగుతున్నాడు…
ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే సుకుమార్ లోకేష్ కనకరాజు ఇద్దరిలో ఎవరు టాప్ డైరెక్టర్ అనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ను బట్టి చూస్తే సక్సెస్ పరంగా అయిన, క్రేజ్ పరంగా అయిన ఎలా చూసుకున్నా లోకేష్ కంటే సుకుమారే టాప్ లో ఉన్నాడు అందువల్ల ఈ ఇద్దరిలో సుకుమార్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడనే చెప్పాలి. ఎందుకంటే సుకుమార్ చేసిన సినిమాలు డిఫరెంట్ వే లో ఉంటాయి.
అలాగే లోకేష్ చేసిన సినిమాలు ఇంకో జానర్ లో ఉంటాయి. అయినప్పటికీ సక్సెస్ లా పరంగా చూసుకున్న, క్రేజ్ పరంగా చూసుకున్న వీళ్ళకి చాలా తేడా అయితే ఉంది. ఇక సుకుమార్ గత చిత్రమైన పుష్ప భారీ లెవెల్ లో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోగా, లోకేష్ కనకరాజ్ గత చిత్రమైన లియో పెద్దగా ఆకట్టుకోలేదు…