Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయడానికి భయపడుతున్న తెలుగు హీరోలు కారణం ఏంటంటే..?

లోకేష్ కనకరాజ్ తెలుగు సినిమా హీరోలతో సినిమాలు చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ మన వాళ్లు మాత్రం అతనికి పెద్దగా అవకాశాలైతే ఇవ్వడం లేదు. ఎందుకంటే...

Written By: Gopi, Updated On : May 11, 2024 12:38 pm

why Telugu heroes are afraid to do a film with Lokesh Kanakaraj

Follow us on

Lokesh Kanagaraj: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్..ఇక ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుందని ప్రతి ప్రేక్షకుడు చాలా నమ్మకంగా ఉంటాడు. అందుకే ఈయన చేసిన సినిమాలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లైతే ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా భారీ సక్సెస్ లను కూడా నమోదు చేసుకున్నాయి.

ఇక తమిళంలోనే కాకుండా ఈ సినిమాలు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకొని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాయి. ఇక ఇప్పుడు ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రతి ప్రేక్షకుడు కూడా సినిమా కోసం విపరీతంగా ఎదురుచూసేలా తన స్టార్ డమ్ ను అయితే విస్తరించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఈయన రజనీకాంత్ తో ‘కూలీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకుల్ని అల్లరించడంలో సక్సెస్ అయింది.

ఇక అందులో భాగంగానే లోకేష్ కనకరాజ్ తెలుగు సినిమా హీరోలతో సినిమాలు చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ మన వాళ్లు మాత్రం అతనికి పెద్దగా అవకాశాలైతే ఇవ్వడం లేదు. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ సినిమాలను కనుక మనం చూసుకుంటే ఆయన ఏ సినిమాకి ఆ సినిమా సపరేట్ గా తీసేయకుండా లోకేష్ యూనివర్స్ అనే పేరు చెప్పి కథ మొత్తం ఇంకో సినిమాలో ఉంది అంటూ చెబుతూ ఈ సినిమాలో మాత్రం తరువాత కథకి లీడ్ గా ఏదో ఒక చిన్న కథను చెప్తూ వస్తాడు. దానికి సరైన కన్ క్లూజన్ ఈ సినిమాలో ఇవ్వకుండా తర్వాత సినిమాల్లో ఉంటుంది అంటూ మనల్ని ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఆయన సినిమాల్లో సరైన కన్ క్లూజన్ ఉండదనే ఉద్దేశ్యం తోనే మన తెలుగు స్టార్ హీరోలు అతనికి డేట్స్ ఇవ్వట్లేదనే వార్తలైతే వస్తున్నాయి…

ఇక రీసెంట్ గా ఆయన చేసిన లియో సినిమా కూడా ఫ్లాప్ అవ్వడానికి కారణం లోకేష్ యూనివర్స్ పేరుతో సినిమాలు చేయడమే అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే లోకేష్ యూనివర్స్ అనే ఒక పేరుని పెట్టుకొని కథంతా రాబోయే సినిమాలో ఉంటుంది అంటూ ఈ సినిమాలో ఏమి చూపించకుండా ఉంటే ఈ సినిమా ఎలా ఆడుతుంది అనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియచేస్తున్నారు…