Homeఎంటర్టైన్మెంట్Lenin Movie Trailer Review: 'లెనిన్' మూవీ ట్రైలర్ రివ్యూ : అఖిల్ బాబు నట...

Lenin Movie Trailer Review: ‘లెనిన్’ మూవీ ట్రైలర్ రివ్యూ : అఖిల్ బాబు నట విశ్వరూపం.. ఈసారి టార్గెట్ మిస్ అయ్యేలా లేదుగా..

Lenin Movie Trailer Review: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ జులై 10 న థియేటర్స్ లోకి రాబోతున్న సందర్భంగా, ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. వైజాగ్ లోని శరత్ థియేటర్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అఖిల్ తో పాటుగా మూవీ టీం మొత్తం ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ట్రైలర్ కి ముందు అఖిల్ సంగీత దర్శకుడు తమన్ ని ట్యాగ్ చేస్తూ చివరి నిమిషం అదిరిపోయిందని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసావని చెప్పుకొచ్చారు. ట్రైలర్ కి బాగా హైప్ ఇచ్చారు. మరి ట్రైలర్ హైప్ తగ్గట్టుగానే ఉందా?, లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

ట్రైలర్ ని చూసిన తర్వాత అర్థమైన మొదటి విషయం ఏమిటంటే , ఈ సినిమాలో అఖిల్ తన నట విశ్వరూపం చూపించాడు అని. ముందు సినిమాలతో పోలిస్తే ఆయన నటనలో చాలా పరిణీతి కనిపించింది , డైలాగ్ డెలివరీ కూడా అదిరిపోయింది అనిపించింది. ఆ లుక్ , యాస కూడా అఖిల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. గ్రామ నేపథ్యం లో జరిగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా డైరెక్టర్ మురళి కిషోర్ తీర్చి దిద్దారు అనిపిస్తోంది. హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే కూడా గెటప్ దగ్గర నుండి యాక్టింగ్ వరకు సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ట్రైలర్ ని బట్టీ అర్థం అవుతున్నది ఏమిటంటే ఇందులో హీరోయిన్ చనిపోతుంది అని. మరి ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక తమన్ అందించిన సంగీతం అఖిల్ చెప్పిన రేంజ్ లో అయితే లేదు కానీ , పర్వాలేదు , బాగానే ఉంది అని అనిపించే రేంజ్ లో ఉంది.

ఇక ఈ ట్రైలర్ లో మైనస్ పాయింట్స్ ఏమిటంటే, స్టోరీ ని వివరించడం తో పాటు , పాత్రల తీరుని కూడా రివీల్ చేయడం. సీనియర్ హీరో శివాజీ ఇందులో ముందుగా హీరో పాత్రకు సపోర్టుగా ఉంటూ , ఆ తర్వాత హీరో కి వెన్నుపోటు పొడుస్తాడని అర్థం అవుతోంది. కథలోని కీలకమైన ట్విస్టులను ఇలా ట్రైలర్ లోనే రివీల్ చేస్తే కిక్ ఏముంటుంది చెప్పండి?.. అంతే కాకుండా కథ కూడా క్లారిటీ గా అర్థం అయ్యేలా కట్ చెయ్యలేదు , ట్రైలర్ బాగుంది కానీ , ఎక్కడా కూడా వావ్ అని అనిపించే రేంజ్ లో అయితే లేదు. ఇది కూడా ఒక మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే రీసెంట్ గా విడుదలైన అఖిల్ సినిమాలతో పోలీస్తే బెటర్ కంటెంట్ మూవీ అనిపిస్తోంది , మరి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.

 

LENIN Trailer - Akhil Akkineni | Bhagyashri Borse | Thaman S | Murali Kishor | July 10th

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version