https://oktelugu.com/

క్లాసికల్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన సొట్టబుగ్గల బ్యూటీ!

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంత మంచి డ్యాన్సరో అందరికీ తెలిసిందే. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠికి గత కొంతకాలంగా అవకాశాలు తగ్గాయి. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన ఈ బామ్మ తాజాగా కన్నానులే పాటకు స్టెప్పులేసి నెటిజన్లను అలరించింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన బొంబాయి సినిమాలో ఈ పాటకు లావణ్య వేసిన స్టెప్పులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. Also Read : #RRR: పులి ఫైట్ తోపాటు ట్రైన్ సీన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 2, 2020 / 01:04 PM IST
    Follow us on

    హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంత మంచి డ్యాన్సరో అందరికీ తెలిసిందే. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠికి గత కొంతకాలంగా అవకాశాలు తగ్గాయి. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన ఈ బామ్మ తాజాగా కన్నానులే పాటకు స్టెప్పులేసి నెటిజన్లను అలరించింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన బొంబాయి సినిమాలో ఈ పాటకు లావణ్య వేసిన స్టెప్పులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.

    Also Read : #RRR: పులి ఫైట్ తోపాటు ట్రైన్ సీన్ గూస్ బంబ్సే?  

    మనీషా కోయిరాలా, అరవింద స్వామి జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఈ సినిమా పాటలు నేటికీ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటాయి. రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే పాటలతో పాటు అంతకు మించిన స్థాయిలో నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తయినా ఈ సినిమాను ఇష్టపడే అభిమానులు నేటికీ ఎంతో మంది ఉన్నారు.

    లావణ్య ఈ పాటకు అద్భుతంగా స్టెప్పులు వేయడంతో తాజాగా ఈ పాట గురించి మరోసారి చర్చ జరుగుతోంది. కొరియోగ్రాఫర్ ఉమాంగ్ గుప్తాతో కలిసి వైట్ డ్రస్ లో లావణ్య వేసిన స్టెప్పులు సూపర్ గా ఉన్నాయి. అడవిలో తెల్ల పంజాబీ డ్రస్సులో లావణ్య అచ్చం దేవకన్యలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లావణ్య ఈ పాటకు స్టెప్పులేయడం గురించి కామెంట్లు చేస్తూ తన మనస్సుకు దగ్గరైన పాటకు డ్యాన్స్ చేశానని… ఇకపై మనస్సును అనుసరించాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

    Also Read : పవన్ బలం.. బలహీనత అభిమానులే..!