https://oktelugu.com/

ఈఎస్‌ఐ స్కాం: మళ్లీ కదులుతున్న డొంక?

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాంని ఏసీబీ అధికారులు మరోసారి తవ్వుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తులో వేగం పెంచారు. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌‌ దేవికారాణి, ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మికి చెందిన రూ.4 కోట్ల 47 లక్షలను తాజాగా స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ భవనాల కోసం ఆ డబ్బును ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థకు ఇచ్చినట్లుగా ఏసీబీ పక్కా సమాచారం అందింది. దీంతో దాడి చేసి ఆ డబ్బును సీజ్‌ చేశారు. బెయిల్‌ మీద బయటకొచ్చిన వెంటనే దేవికారాణి ఈ […]

Written By: , Updated On : September 2, 2020 / 01:02 PM IST
Follow us on

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాంని ఏసీబీ అధికారులు మరోసారి తవ్వుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తులో వేగం పెంచారు. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌‌ దేవికారాణి, ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మికి చెందిన రూ.4 కోట్ల 47 లక్షలను తాజాగా స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ భవనాల కోసం ఆ డబ్బును ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థకు ఇచ్చినట్లుగా ఏసీబీ పక్కా సమాచారం అందింది. దీంతో దాడి చేసి ఆ డబ్బును సీజ్‌ చేశారు. బెయిల్‌ మీద బయటకొచ్చిన వెంటనే దేవికారాణి ఈ డబ్బులు అప్పజెప్పారు.

కొంతకాలం క్రితం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్‌ఐ స్కాం కేసు సంచలనం రేపింది. ఈ కేసులో డైరెక్టర్‌‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, మరికొంత మంది మధ్యవర్తులను అరెస్టు చేశారు. మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారంతా కూడా బెయిల్‌పై బయటికి వచ్చారు. తాజాగా డైరెక్టర్‌‌ దేవికారాణి, ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మికి చెందిన నగదును భారీ మొత్తంలో సీజ్‌ చేయడంతో మరోసారి కేసు తెరపైకి వచ్చింది.

మందుల కొనుగోలు, అమ్మకాలు, మెడికల్‌ క్యాంప్‌లు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్పెన్సరీల్లో అవకతవకాలు జరిగాయని గతంలోనే అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ గోల్‌మాల్‌లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు నిరూపించారు. దేవికారాణినే పాత్రధారి, సూత్రధారిగా చేర్చారు. ఆమె ఆస్తుల మీద ఆరా తీయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దేవికారాణి ఆస్తులపై ఆరా తీసిన ఏసీబీ.. ఐటీ కారిడార్‌‌లో సైబరాబాద్‌కు చెందిన ఆ సంస్థకు భారీ ఎత్తున డబ్బును అందజేశారు. అక్రమ సంపాదనలో కొంత సొమ్మును రూ.4కోట్ల 47 లక్షలను తాజాగా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. వీటిలో దేవికారాణి రూ.3,75,30,000 చెల్లించగా.. నాగలక్ష్మి రూ.72 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. వీటితో సైబరాబాద్‌లో ఆరు రెసిడెన్షియల్‌ ఫ్లాట్లతో పాటు దాదాపు 15 వేల చదరపు అడుగుల కమర్షియల్‌ స్థలాలను తన కుటుంబ సభ్యుల పేరిట కొనేందుకు దేవికారాణి ప్లాన్‌ వేసింది. బినామీల పేరుతోనే రూ.22 లక్షల్ని ఆ సంస్థకు చెల్లించినట్లుగా అధికారులు తెలిపారు. ఇదీ కాకుండా మరో రూ.2 కోట్ల 29 లక్షల 30 వేల విలువైన చెక్కులు, ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌‌ చేసినట్లు బయటపడింది.