https://oktelugu.com/

Ghee: నెయ్యి తింటే ఏం అవుతుందో తెలుసా?

నెయ్యి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యిలో విటమిన్స్ డి, కె, ఇ, ఎలు ఉన్నాయి. నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇతర ఆహార పదార్థాల నుంచి పోషకాలను గ్రహిస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 13, 2024 / 01:48 PM IST

    Ghee

    Follow us on

    Ghee: మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇక వర్షాకాలంలో హెల్త్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే. ఈ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలి. ఈ సీజన్‌లో ఎక్కుగా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ బలంగా ఉండాలి. ఇమ్యూనిటీని పెరగాలంటే నెయ్యి తినాలి. నిజానికీ ఈ టైమ్‌లో రోజుకో స్పూన్ నెయ్యి తినాలి. తింటే చాలా సమస్యల నుంచి దూరం అవచ్చు. మరి అవేంటో తెలుసుకోండి.

    నెయ్యి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యిలో విటమిన్స్ డి, కె, ఇ, ఎలు ఉన్నాయి. నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇతర ఆహార పదార్థాల నుంచి పోషకాలను గ్రహిస్తుంది.

    వర్షాకాలంలో జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. గ్యాస్ అసిడిటీ సమస్యలకి నెయ్యి దివ్యౌషధం. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి.. దీన్ని పెద్దప్రేగు కణాలు తమకి ఇష్టమైన శక్తి వనరుగా వాడతాయి. ఉదయమే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ టీస్పూన్ నెయ్యి కలిపి తీసుకుంటే మలబద్ధకం దూరమై జీర్ణక్రియ మెరుగ్గా అవుతుంది.

    నెయ్యి చర్మం, జుట్టుకి కూడా చాలా బెటర్ గా ఉపయోగపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచేందుకు హెల్ప్ అవుతుంది నెయ్యి. దీనిని తీసుకోవడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అయితే నెయ్యిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు. దీనిని తీసుకున్న తర్వాత జీర్ణక్రియ బలంగా మారుతుంది కాబట్టి.. అతిగా తినకుండా ఉంటారు.