https://oktelugu.com/

Mega Nara Nandamuri’s families: ప్రమాణ స్వీకార వేళ మెగా నారా నందమూరి ఫ్యామిలీల్లో కనిపించిన ఉద్వేగం ఉత్సాహం…

Mega Nara Nandamuri's families: పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తన భార్య అయిన అన్న లెజొనోవా సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా, చిరంజీవి ముఖంలో మాత్రం చాలా గర్వమైతే కనిపించింది...

Written By:
  • Gopi
  • , Updated On : June 13, 2024 / 01:47 PM IST

    Mega Nara Nandamuri families

    Follow us on

    Mega Nara Nandamuri’s families: ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మంత్రిగా లోకేష్ లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశం లోని అతిరథ మహారథులందరూ వచ్చారు. ఇక మొత్తానికైతే ఈ ఫ్యామిలీలో ఉన్న వారందరూ ప్రమాణ స్వీకారం రోజున చాలా సంతోషంగా ఉండడం అనేది మనకు కనిపించింది. ఇక ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన భార్య పిల్లలతో పాటు చిరంజీవి దంపతులు, నాగబాబు దంపతులు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఇక శ్రీజ తోపాటుగా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

    ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తన భార్య అయిన అన్న లెజొనోవా సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా, చిరంజీవి ముఖంలో మాత్రం చాలా గర్వమైతే కనిపించింది…ఇక అలాగే ప్రమాణస్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న ప్రముఖులందరికి నమస్కరించాడు. చిరంజీవి కాళ్ళకి దండం పెడుతుంటే అతను వద్దు అన్నట్టుగా వారించినప్పటికి తన కాళ్ళకి మొక్కి ఆ తర్వాత ఇద్దరు కౌగిలించుకున్నారు. ఇక దాంతో మెగా ఫ్యామిలీతో పాటుగా మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు…

    ఇక ఇదిలా ఉంటే లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తన భార్య అయిన బ్రాహ్మిని తన కొడుకు అయిన దేవాన్షు తో స్టేజ్ వైపు చూడమని చెబుతూ లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది. ఇక లోకేష్ ప్రమాణ స్వీకారం అనంతరం మోడీ కాళ్ళు మొక్కబోతుండగా ఆయన వద్దనట్లుగా వారించారు. అలాగే అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుల కాళ్లకు కూడా నమస్కరించాడు. ఇక చంద్రబాబు కాళ్లకి కూడా దండం పెట్టుకున్నాడు.

    ఇక ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో నందమూరి నారా ఫ్యామిలీ మొత్తం నాలుగోసారి చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయం లో ఆయన్ని చూసి ఫ్యామిలీ అంతా చాలా గర్వం గా ఫీల్ అయ్యారు. ఇక బాలయ్య కూడా తన సోదరీ, చంద్రబాబు నాయుడు భార్య అయిన భువనేశ్వరి దగ్గరికి వెళ్లి తనను దీవించి తన నుదిటి మీద ప్రేమతో ఒక ముద్దు కూడా పెట్టాడు. ఇక మొత్తానికైతే అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి, నారా ఫ్యామిలీ అందరూ హ్యాపి గా ఉండడమే కాకుండా ఆ ప్రోగ్రాం ని సక్సెస్ ఫుల్ గా ముగించారు. ఇక ఇప్పుడు తమ బాధ్యతను నిర్వర్తించే పనిలో ముందుకు సాగుతున్నారు…