Lavanya- Upasana: పెళ్లికి ముందే ఉపాసన, లావణ్యల మధ్య గొడవ? అంత మాట అనేసిందా?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే నిశ్చితార్థం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి కూడా ఇటలీలో ఫిక్స్ చేశారు.

Written By: Suresh, Updated On : October 14, 2023 12:11 pm

Lavanya- Upasana

Follow us on

Lavanya- Upasana: తోటి కోడళ్లు ఉన్న ఇంట్లో గొడవ కామన్. అది కామన్ పీపుల్స్ అయినా సెలబ్రెటీలు అయినా కూడా గొడవలు ఉంటాయి. తీవ్రత తక్కువ ఉండవచ్చు కానీ గొడవ అనేది కామన్ గా ఉండే విషయమే. అత్త చిన్న కోడలిని మెచ్చుకుంటే పెద్ద కోడలికి, పెద్ద కోడలిని మెచ్చుకుంటే చిన్న కోడలికి కోపం. చిన్న విషయాలు అయినా సరే ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా. మెగా ఫ్యామిలీలో కూడా ఇదే గొడవ మొదలైందట..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే నిశ్చితార్థం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి కూడా ఇటలీలో ఫిక్స్ చేశారు. అంతా హాయిగా సాగిపోతుంది అనుకునే టైమ్ లోనే ఓ వార్త ఇప్పుడు అందరిని కలవర పెడుతుంది. ఇంకా కోడలిగా అడుగుపెట్టకముందే లావణ్య, ఉపాసనల మధ్య గొడవ మొదలైందట. వరుణ్, లావణ్యల పెళ్లి విషయంలో కాస్ట్యూమ్ డిజైన్, డెకరేషన్, గెస్టులు, గెస్టులకు రిటర్న్ గిఫ్టుల గురించి ఉపాసన ప్లాన్ చేస్తున్నారట.

ఉపాసన చేసిన ఈ ప్లాన్ లో కొన్ని విషయాలు లావణ్య త్రిపాఠికి నచ్చకపోవడంతో అభిప్రాయ బేధాలు వచ్చాయట. ఉపాసన సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్ డిజైన్స్ లావణ్యకు నచ్చకపోవడంతో.. నచ్చని పని ఎందుకు చేయడం అని మొహం మీదనే చెప్పేసిందట లావణ్య. ఇలా మొహం మీదనే చెప్పడంతో హట్ అయినా ఉపాసన అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయిందట. ఇదిలా ఉంటే లావణ్య వరుణ్ తో నా పెళ్లి నా ఇష్టం, తన పెత్తనం ఏంటి అని ఉపాసన నొచ్చుకునేలా మాట్లాడిందనే టాక్ కూడా వినిపిస్తుంది. కానీ ఇందులో నిజం ఎంత అనేది తెలియదు.

పెళ్లికి ముందే గొడవలు జరిగితే ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా కలిసి ఉన్న కుటుంబంలో కల్లోలాలు తప్పవని కొందరి వాదన. ఈ వార్త నిజం కాకూడదు అని కోరుకునే వారు కూడా ఎందరో ఉన్నారు. మరి దీనిపై మెగా ఫ్యామిలీ లేదా లావణ్య స్పందిస్తే గానీ అసలు నిజం బయట పడదు.