https://oktelugu.com/

Lavanya Tripathi: వరుణ్ అలాంటివాడు… పెళ్ళయ్యాక మొదటిసారి ఓపెన్ అయిన లావణ్య!

లావణ్య త్రిపాఠి భర్తకు విషెస్ చెప్తూ వరుణ్ లో తనకు నచ్చే ఓ క్వాలిటీ మొదటిసారి బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ' పుట్టిన రోజు శుభాకాంక్షలు వరుణ్ తేజ్ . మీరు చాలా ప్రత్యేకం, నేను కలుసుకున్న అత్యంత అద్భుతమైన వ్యక్తి.

Written By:
  • S Reddy
  • , Updated On : January 21, 2024 / 08:55 AM IST

    Lavanya Tripathi- Varun Tej

    Follow us on

    Lavanya Tripathi: వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి గత ఏడాది నవంబర్ లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.వీరి పెళ్లి ఇటలీ లోని టుస్కానీ నగరం లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మొదటి బర్త్ డే జరుపుకుంటున్నారు. జనవరి 19న వరుణ్ 34వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు.

    ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి భర్తకు విషెస్ చెప్తూ వరుణ్ లో తనకు నచ్చే ఓ క్వాలిటీ మొదటిసారి బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు వరుణ్ తేజ్ . మీరు చాలా ప్రత్యేకం, నేను కలుసుకున్న అత్యంత అద్భుతమైన వ్యక్తి. మీలో నాకు నచ్చింది .. ఇతరులను ప్రేమించే, శ్రద్ధ చూపే గుణం. మీ ఈ లక్షణం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది’ అంటూ పోస్ట్ రాసుకొచ్చింది.

    ఇక వరుణ్ తో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. భర్తపై ఆమెకున్న అపారమైన ప్రేమను చాటుకుంది. కాగా లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా అత్తవారింట అడుగు పెట్టి సందడి చేస్తుంది. ఇటీవల జరిగిన మెగా సంక్రాంతి సంబరాల్లో లావణ్య ప్రత్యేకంగా నిలిచింది. అటు కుటుంబాన్ని, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అయితే ఇటీవల లావణ్య త్రిపాఠి ఓ వెబ్ సిరీస్ లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్ తో కలిసి ఈ వెబ్ సిరీస్ లో ఆమె నటించారు.

    అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా .. తన నెక్స్ట్ ఫిలిం మట్కా కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. టీజర్ చూసిన వరుణ్ తేజ్ ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ చెప్తూ .. ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.