https://oktelugu.com/

Allu Arjun With Pushpa Team: బన్నీని విస్మయానికి గురి చేసిన ‘ఏఏ’ ఫ్యామిలీ !

Allu Arjun With Pushpa Team: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమాటూ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ప్రజాదరణ సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కార్యాలయంలో ఎర్రచందనం దుంగలను పోలిన దుంగలు, గొడ్డలి, పుష్ప కటౌట్‌, ఓ కేక్‌ను అల్లు అర్జున్ పర్సనల్ టీమ్ సిద్ధం చేసి ఆయన్ని ఆశ్చర్యపరిచారు. తన ‘ఏఏ’ ఫ్యామిలీ నిజంగానే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 30, 2022 / 10:52 AM IST
    Follow us on

    Allu Arjun With Pushpa Team: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమాటూ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ప్రజాదరణ సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కార్యాలయంలో ఎర్రచందనం దుంగలను పోలిన దుంగలు, గొడ్డలి, పుష్ప కటౌట్‌, ఓ కేక్‌ను అల్లు అర్జున్ పర్సనల్ టీమ్ సిద్ధం చేసి ఆయన్ని ఆశ్చర్యపరిచారు.

    Allu Arjun with Pushpa Team

    తన ‘ఏఏ’ ఫ్యామిలీ నిజంగానే విస్మయానికి గురి చేసిందని, వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మొత్తానికి బన్నీని సర్ ప్రైజ్ చేసింది ఆయన పర్సనల్ టీమ్. పుష్ప సినిమా మొత్తానికి 18వ రోజు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ తర్వాత కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.

    Allu Arjun

    నిజానికి మొదటి రోజు నుంచీ ‘పుష్ప’ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా ఆ తర్వాత బాగా పుంజుకుంది. కాగా బాక్సాఫీసు వద్ద పుష్పరాజ్ తన ప్రభావాన్ని బాగానే చూపిస్తోంది. ‘పుష్ప’ అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

    Also Read: Allu Arjun: బన్నీకి 75 కోట్లు.. ఆ విషయంలో బాలయ్యే ఆదర్శం !

    Allu Arjun

    కాగా ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ. 300.04 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. కలెక్షన్స్ తో పాటు మిగిలిన అన్ని రైట్స్ తాలూకు డబ్బులు అన్నీ లాభాల కిందకే వస్తాయి. కాకపోతే ఈ చిత్రం అన్నీ చోట్ల బ్రేక్ ఈవెన్ ను సాధించినా.. ఆంధ్రలో మాత్రం నష్టపోయింది.

    Also Read: 300 కోట్ల బిజినెస్ కి రవితేజకు 72 కోట్ల రెమ్యునరేషన్ !

    Tags