Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి కరుకుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. పార్టీని విజయ తీరాలకు నడిపించేక్రమంంలో నిక్కచ్చిగా ఉండాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు.గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకూడదని చూస్తున్నారు. పకడ్బందీ చర్యలు తీసుకుంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. స్వార్థంతో పార్టీలు మారే జంప్ జలానీలపై జాగ్రత్తగా ఉండాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగానే గతంలో పార్టీని ముప్ప తిప్పలు పెట్టిన వారిపై ఫోకస్ పెడుతున్నారు. ఈసారి వారికి టికెట్లు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ఎవరెవరిపై వేటు వేయాలని ఆలోచిస్తున్నారు.

గ్రూపు రాజకీయాలతోనే పార్టీ కష్టాల్లో పడింది. ఓటమి పాలయింది. అధికారానికి దూరమైంది. దీంతో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంలోనే బాబు పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. చివరి సమయంలో వచ్చి హడావిడి చేసి టికెట్ దక్కించుకుని పార్టీని ఎదగనీయకుండా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని తలపోస్తున్నారు. ఇందుకోసం శ్రమిస్తున్నారు. టీడీపీ నేతలను సరైన దారిలో పెట్టే క్రమంలో వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
Also Read: Chandrababu Delhi Tour: మరోసారి ఢిల్లీకి.. ఈసారి సీరియస్ గానే?
వైసీపీ కూడా బలంగా పోరాటం చేస్తున్న క్రమంలో టీడీపీ మరింత పదును పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో బలమైన పార్టీగా వైసీపీకి తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇంకా ఎదగాల్సి ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. దీని కోసమే కేడర్ ను సిద్ధం చేస్తున్నారు. వైసీపీ కార్యక్రమాలను తలదన్నే రీతిలో టీడీపీ వ్యూహాలు ఉండాలని చూస్తున్నారు. దీని కోసం పటిష్టమైన యంత్రాంగాన్ని డెవలప్ చేస్తున్నారు. నిష్ణాతులైన వారిని నియమించుకుని పార్టీకి అండగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు. నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆపద సమయంలో పార్టీకి వెన్నంటి ఉన్న వారి సేవలు వినియోగించుకోవాలని రెడీ అవుతున్నారు. వారి కోసం అవసరమైతే త్యాగం చేయడానికి కూడా తయారుగా ఉండాలని నేతలకు చెబుతున్నారు. భవిష్యత్ లో పార్టీని గాడిలో పెట్టి అధికారం సాధించుకోవాలనే తాపత్రయంలో ఉన్నారు.దీని కోసం ఎంతటి కష్టానికైనా ఓర్చి పార్టీని విజయపథంలో నడిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. సీనియర్లను సైతం పక్కనపెట్టి యువతకే ఎక్కువగా టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో చంద్రబాబులో మార్పు స్పష్టంగా వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Chandrababu Naidu: చంద్రబాబులో నిజంగానే మార్పు వచ్చిందా?
[…] […]