Nandamuri Balakrishna: ఆహాలో స్ట్రీమ్ అవుతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 1 పూర్తయ్యింది. లాస్ట్ సీజన్ గెస్టుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు హాజరవ్వగా.. మోస్ట్ ఎంటర్ టైన్మెంట్‌గా సాగిన ఈ ఎపిసోడ్ లో మహేష్ ను ఉద్దేశించి బాలయ్య చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ‘నువ్వు కేవలం నటుడివి మాత్రమే కాదు. ఒక తరాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గదర్శివి’ అని బాలయ్య చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

మొత్తానికి ఈ ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇక ఈ షో చివరి ఎపిసోడ్ లో బాలయ్య, మహేశ్ సరదాగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా పెళ్లి గురించి బాలయ్య ప్రశ్న అడగ్గానే సూపర్ స్టార్ సిగ్గుపడ్డాడు. మరి మహేష్ తన పెళ్లి గురించి అడిగితే ఎందుకు సిగ్గు పడ్డాడు ? అనేది ఈ ఫుల్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి.
Also Read: వామ్మో.. అనసూయ రవితేజకు ఇన్ని కండీషన్లు పెట్టిందా..?
అన్నట్టు బాలయ్య ప్రశ్నలకు మహేశ్ బాబు తనదైన శైలిలో సరదాగా సమాధానాలు చెప్పడం చాలా బాగుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పై నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపిస్తూ.. మాట్లాడటం మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ను ఇచ్చింది. పైగా బాలయ్య సోషల్ మీడియాలో కూడా మహేష్ ను పొగుడుతూ ఒక మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే.

సహజంగా బాలయ్య, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. అలాంటిది.. తన బాలయ్య పేస్ బుక్ లో మహేష్ గురించి రీసెంట్ గా కామెంట్ పెడుతూ.. ‘అద్భుతమైన నటుడు.. అంతకన్న అద్భుతమైన మనసు ఉన్న మనిషి మన సూపర్ స్టార్ మహేష్’ అని బాలయ్య పోస్ట్ చేసాడు. మొత్తానికి బాలయ్యను కూడా మహేష్ ఆకట్టుకున్నాడు.
Also Read: ‘పిచ్చి పట్టిందా’ అంటూ రాహుల్ రామకృష్ణ పై నెటిజన్లు సీరియస్ !
[…] TRS, BJP: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అనంతరం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమంలో నెలకొల్పిన సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రధాని వెంట ఉండాల్సి ఉన్నా రాలేదు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. పీఎం వచ్చినా లెక్క చేయకుండా గైర్హాజరు కావడంపై రాజకీయ దురుద్దేశం ఉందని బీజేపీ నేతలు ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతివిమర్శలకు దిగారు. దీంతో రాజకీయ వేడి రాజుకుంది. […]
[…] Lata Mangeshkar: భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ కరోనా బారిన పడి, నేడు తుది శ్వాస విడిచి అశేష అభిమానులను కన్నీళ్ల లోకంలోకి నెట్టేశారు. కరోనాతో గత 29 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిన్న చెప్పారు. ఇవాళ ఆమె చనిపోయినట్లు సోదరి ఉష మంగేష్కర్ ప్రకటించారు. […]