https://oktelugu.com/

Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలతో దూసుకుపోతూనే, మరోవైపు కమర్షియల్ యాడ్స్ కూడా వరసగా చేస్తున్నాడు బన్నీ. ఇప్పటికే రాపిడో, ఆహా, శ్రీ చైతన్యకు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్న అల్లు అర్జున్ ఖాతాలో, ఇప్పుడు జొమాటో కూడా చేరిపోయింది. అయితే ఈ యాడ్ లో “సౌత్ సినిమా కథ ఎక్కువసేపు గాల్లోనే ఉండాలి” అనే డైలాగ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 6, 2022 / 11:29 AM IST
    Follow us on

    Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలతో దూసుకుపోతూనే, మరోవైపు కమర్షియల్ యాడ్స్ కూడా వరసగా చేస్తున్నాడు బన్నీ. ఇప్పటికే రాపిడో, ఆహా, శ్రీ చైతన్యకు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్న అల్లు అర్జున్ ఖాతాలో, ఇప్పుడు జొమాటో కూడా చేరిపోయింది. అయితే ఈ యాడ్ లో “సౌత్ సినిమా కథ ఎక్కువసేపు గాల్లోనే ఉండాలి” అనే డైలాగ్ సౌత్ సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి చూపుతుందని, బన్నీపై విరుచుకుపడుతున్నారు నెటిజెన్స్.

    Allu Arjun

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ‘కెరీర్‌ ప్రారంభంలో నల్లగా ఉన్నావు, నటిగా పనికి రావు అని తీవ్రంగా అవమానించారు. ఓ డైరెక్టర్‌, మూవీలో ఛాన్స్‌ ఉంది చేస్తావా? అని అడిగారు. ఒకే చెప్పాను. ఫొటో షూట్‌ కు రమ్మన్నాడు. ఆ తర్వాత కాల్ రాలేదు. ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నెట్‌లో కొంతమంది లీక్‌ చేశారు. వాటి వల్ల నా కుటుంబం దూరమైంది’ అని తెలిపింది.

    Also Read: ఏకంగా కేసీఆర్ కే ఎసరు పెడుతున్న రేవంత్ రెడ్డి

     

    jaya-vani

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘అరణ్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటుడు విష్ణు విశాల్ ఇప్పుడు మరో సినిమా FIRతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అతను నటించిన FIR తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి తన భార్య జ్వాల గుత్తానే ప్రధాన కారణమని వెల్లడించాడు. రవితేజ కూడా తన స్క్రిప్ట్ సెలక్షన్‌ని మెచ్చుకున్నాడని ఓ ఇంటర్వ్యూలో విష్ణు చెప్పుకొచ్చాడు.

    FIR

    Tags