Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏ వ్యూహం చేపట్టినా గజ్వేల్ ను ఎంచుకోవడంతో రేవంత్ రెడ్డి కేసీఆర్ నియోజకవర్గాన్ని నేరుగా చూస్తున్నారు. దీని కోసమే గతంలో కూడా ఇక్కడే రచ్చబండ నిర్వహించాలని చూసినా అది సాధ్యం కాలేదు. దీంతోనే ఆయన ప్రస్తుతం కూడా గజ్వేల్ కే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలకాలంలో సీఎం నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి అక్కడికి తరచు వెళుతూ వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రేవంత్ రెడ్డికి పార్టీలో సీనియర్ల అండ లేకపోవడంతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేకపోతున్నారు. పార్టీని ముందుకు నడిపించాలని భావిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: వామ్మో.. అనసూయ రవితేజకు ఇన్ని కండీషన్లు పెట్టిందా..?
ప్రస్తుతం సిద్దిపేట కేంద్రంగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడి వారితో తరచూ కలుస్తున్నారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు వారి సమస్యలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో గజ్వేల్ పైనే గురిపెడుతున్నారు. సీఎం అయ్యాక కేసీఆర్ గజ్వేల్ గురించి అంతగా పట్టించుకోవడం లేదు. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు సైలెంట్ అయిపోయిన సందర్భంలో పార్టీని ముందుకు నడిపించే ఉద్దేశంతో రేవంత్ ఆలోచనలు చేస్తున్నారు. కానీ అవి ఆచరణ సాధ్యం కావడం లేదు. పార్టీలో కలిసి వచ్చే నేతలు తక్కువగానే ఉండటంతోనే ఆయన కాస్త దూకుడు తగ్గించుకున్నట్లు సమాచారం.
Also Read: హాట్ ఫోజులతో రెచ్చిపోయిన మీరా జాస్మిన్ !