Bharadwaj: సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న మూవీ ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ.. ‘నిజాయతీగా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. కెమెరాకి ప్రతిభ కావాలని నిరూపిస్తూ వస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులు ఇందులో నటించారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన కనకం పాత్రని చేశా’ అని చెప్పింది.

అన్నట్టు ఈ సినిమా ప్రమోహన్ లో భాగంగా నెటిజన్స్ తో అనసూయ తన ఇన్ స్టాలో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘మీరు హీరోయిన్ గా ఒక సినిమా చేస్తే చూడలని ఉంది ?’ అని అడిగాడు. దానికి అనసూయ రిప్లై ఇస్తూ.. నేను ఈ సినిమాలో హీరోయిన్ గానే నటిస్తున్నాను. హ్యాపీగా చూడండి’ అంటూ సమాధానం ఇచ్చింది.
Also Read: ఒక తరాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గదర్శివి – బాలయ్య
అలాగే, మరో నెటిజన్.. ‘మిమ్మల్ని మేము ఎలా అర్ధం చేసుకోవచ్చు ?’. మీకు ఎలా అర్ధం అయితే.. అలాగే అర్ధం చేసుకోండి” అంది. మీరెందుకు ఎప్పుడు ఆంటీలా ఉంటారు ?’ అని ఒక ప్రశ్న అడిగాడు మరో నెటిజన్. దానికి స్పందించిన అనసూయ..‘అసలు నన్ను ఆంటీ అని పిలవడానికి నువ్వు ఎవరు ? ఆయినా నీకు ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదు’ అంటూ.. పనిలో పనిగా ఎప్పటిలాగే సీరియస్ అయింది.

మొత్తానికి అనసూయ ఎక్కడా తగ్గడం లేదు. అన్నట్టు అనసూయ, మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో కూడా నటించబోతుంది. ఆమె పాత్ర గతంలో చిరును ప్రేమించి, కొన్ని కారణాల వల్ల దూరమైన పాత్ర అని ప్రచారం జరుగుతుంది. ఎలాగూ అనసూయ బాడీ లాంగ్వేజ్ కి నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయి. దర్శకుడు మోహన్ రాజా కూడా అందుకు తగ్గట్టుగానే అనసూయ క్యారెక్టర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడని తెలుస్తోంది.
Also Read: ఏపీ పీఆర్సీ వివాదం సమాప్తం.. సమ్మె విరమించిన ఉద్యోగ సంఘాలు.. జగన్ సర్కార్ గొప్ప ఊరట
[…] Lata Mangeshkar: భారతీయ గాన కోకిలగా అలాగే భారత నైటింగేల్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. దాదాపు 7 దశాబ్దాలుగా తన పాటలతో అలరించిన ఆమె గురించి తెలియని సంగీత అభిమానులు ఉండరు. ఎన్నో పాటలకు తన చక్కని స్వరాన్ని అందించిన ఆమె.. మనవరాలి వయసున్న యువ హీరోయిన్లకు గాత్రం అందించారు. కానీ గానకోకిల గొంతు మూగబోయింది నేడు. […]