TRS, BJP: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అనంతరం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమంలో నెలకొల్పిన సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రధాని వెంట ఉండాల్సి ఉన్నా రాలేదు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. పీఎం వచ్చినా లెక్క చేయకుండా గైర్హాజరు కావడంపై రాజకీయ దురుద్దేశం ఉందని బీజేపీ నేతలు ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతివిమర్శలకు దిగారు. దీంతో రాజకీయ వేడి రాజుకుంది.
ఈనేపథ్యంలో రెండు పార్టీలు పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీల మధ్య ఇప్పటికే దూరం పెరిగిపోవడంతో ప్రస్తుతం మరింత అగాధం పెరిగిపోతోంది. ప్రధాని పర్యటన గురించి ముందే తెలిసినా కేసీఆర్ ఎందుకు ప్రోగ్రాంకు రాలేకపోయారనే దానిపై స్పష్టత లేదు. ఏదైనా అత్యవసర సమావేశం ఉంటే రాకపోవడానికి కారణం ఉండేది కానీ ఏది లేకున్నా ప్రధాని వెంట ఉండేందుకు ఎందుకుతప్పించుకున్నారనే దానిపై ఆందోళన నెలకొంది.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !
ఇన్నాళ్లు ఏదో అనుకున్నా ప్రస్తుతం మాత్రం బీజేపీకి టీఆర్ఎస్ కు పడటం లేదని తెలుస్తోంది. కేసీఆర్ కావాలనే కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెండు పార్టీల మధ్య ఎంత గ్యాప్ ఉన్నా ఇది ప్రజలకు తెలిసేలా ఉండకూడదని చెబుతున్నారు. కానీ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎవరికి వారే తమదైన శైలిలో విభేదాలు పెంచుకుంటున్నాయి. దీంతోనే వాటి మధ్య వైరం ఎక్కువవుతోంది.
ప్రధాని హైదరాబాద్ లో గడిపినా కేసీఆర్ రాకపోవడంపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఇటీవల కాలంలో అభిప్రాయభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రధాని వచ్చినప్పుడు మాత్రం అవి బయటపడకుండా ఉండాల్సింది. కేసీఆర్ చేసిన నిర్వాకంతో విమర్శల పాలవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో కేసీఆర్ వైఖరిపై అందరిలో ఆగ్రహం వస్తోంది. ప్రధానికి మర్యాద ఇవ్వకుండా ఇలా ప్రవర్తించడంపై ఇంకా మనస్పర్థలు పెరుగుతున్నాయనడంలో సందేహం లేదు.
ఆన్ లైన్ లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎవరికి వారే పోస్టింగులు పెడుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నాయి. ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తుంటే ఎందుకు రావాలని టీఆర్ఎస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో ఒకరి కంటేమరొకరు ఎక్కువగా రెచ్చిపోతున్నారు. దీంతో ఇరు పార్టీల నేతలతో ఆన్ లైన్ ట్రెండింగ్ పెరిగిపోతోంది.