https://oktelugu.com/

RadheShyam: స్నేహితులతో కలిసి రాధేశ్యామ్​ సినిమా చూసిన ప్రభాస్​.. ఆ సీన్​ మాత్రం?

RadheShyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పీరియాడికల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్​ భవిష్యత్తును చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్​లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా ఈ సినిమా రూపొందుతోంది.  కాగా, ఇటీవలే ఈ సినిమాలో ప్రభాస్​ పాత్రకు సంబంధించిన టీజర్​ ప్రేక్షకులను ఆకట్టుకుంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 29, 2021 / 12:26 PM IST
    Follow us on

    RadheShyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పీరియాడికల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్​ భవిష్యత్తును చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు.

    వింటేజ్ బ్యాక్‌డ్రాప్​లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా ఈ సినిమా రూపొందుతోంది.  కాగా, ఇటీవలే ఈ సినిమాలో ప్రభాస్​ పాత్రకు సంబంధించిన టీజర్​ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు రెండ్రోజులకు పైగా ఈ టీజర్​ యూట్యూబ్​లో ట్రెండింగ్​లో నిలిచింది. తాజాగా, ఈ సినిమాలోని తొలి రిలికల్​ సాంగ్ విడుదల చేశారు మేకర్స్​.. ఎవరో వీరెవరో అంటూ సాగే ఈ పాటకు మంచి స్పందన లభించింది.

    కాగా, ఈ రోజు మరో అప్​డేట్​తో ముందుకు వస్తున్నారు. ఈ సినమాలోని రెండో పాట టీజర్​ను తెలుగులో రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఇటీవలే ప్రభాస్​ తన స్నేహితులతో కలిసి చూశారట. ఓవరాల్​గా సినిమా ప్రభాస్​కు నచ్చిందని సమాచారం. ఇందులో ఓ ప్రధాన ఎపిసోడ్​ ఎంతో థ్రిల్లింగ్​గా ఉంటుందని తెలుస్తోంది. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఆ సీన్​ ఉండనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే, అది లవ్​ సీన్ఆ లేక యాక్షన్​ సీన్​ఆ తెలియాల్సి ఉంది.  కాగా, ఈ సినిమాతో పాటు, ప్రభాస్​ సలార్​, ఆదిపురుష్​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ పూర్తయింది. ఇందులో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్​. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.