Actress Sree leela: పరీక్షల ప్రిపరేషన్ లో బిజీ అయిన నటి శ్రీలీల…

Actress Sree leela: ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లోనే అభిమానుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నటి శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ దర్శకత్వం వహించిన “పెళ్ళి సందD” సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ ముద్దుగుమ్మ. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే రాఘవేంద్రరావు కూడా ఓ కీలకపాత్రలో మొదటిసారి తెరముందు కనిపించి అదరగొట్టారు. Also Read: ఒక్క నైట్ లో జాతకం మారిపోతుందని చెప్తున్న […]

Written By: Raghava Rao Gara, Updated On : November 30, 2021 5:00 pm
Follow us on

Actress Sree leela: ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లోనే అభిమానుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నటి శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ దర్శకత్వం వహించిన “పెళ్ళి సందD” సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ ముద్దుగుమ్మ. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే రాఘవేంద్రరావు కూడా ఓ కీలకపాత్రలో మొదటిసారి తెరముందు కనిపించి అదరగొట్టారు.

Actress Sree leela

Also Read: ఒక్క నైట్ లో జాతకం మారిపోతుందని చెప్తున్న రకుల్ ప్రీత్ సింగ్…

ఈ సినిమాకి కీరవాణి సంగీతం మరో హైలైట్ అని చెప్పాలి. కానీ ఈ సినిమా ఆశించిన మేర ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ శ్రీలీల అందానికి, నటనకు మాత్రం ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు చదువును కొనసాగిస్తూనే మరో వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తుందిఈ భామ. ఈ క్రమంలోనే పెళ్ళిసందడి సినిమా కోసం హైదరాబాద్ వచ్చింది ఈ చిన్నది.

ఇప్పుడు ఈ బ్యూటీ మళ్ళీ చదువు మీద దృష్టి పెట్టింది అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఎంబీబీఎస్ పరీక్షలు దగ్గరపడుతుండటం ఈ అమ్మడు ఇప్పుడు తిరిగి ముంబై చెక్కేసి శ్రద్దగా చదువుకుంటుంది అని సమాచారం. ఈ క్రమంలో పరీక్షలు పూర్తయ్యే వరకూ సినిమాల గురించి ఆలోచించకుండా చదువు పైనే ఫోకస్ చేయనుందట శ్రీలీల. ఆ తర్వాత ఈ బ్యూటీ తిరిగి కెమెరా ముందుకు రానుంది. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో నటిస్తుంది. అంతేకాదు కుర్ర హీరోలు శ్రీలీల హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. దీంతో ఇప్పటికే ఈ శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని సమాచారం.

Also Read: ఆ విషయంలో మీడియాకి సారీ చెప్పిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌…