Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, సునీల్ , అనసూయ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు సమంత ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేయనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పాన్ ఇండియా లెవల్లో సినిమాను ప్రమోట్ చేసేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు మూవీ యూనిట్. ఇక హిందీలో ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు స్వయంగా బన్నీనే రంగంలోకి దిగుతున్నాడట. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్‌లో బన్నీ స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త ఇండస్ట్రి లో చక్కర్లు కొడుతోంది.

కాగా బన్నీ, సల్మాన్ ఖాన్‌లకు ఇదివరకే పరిచయం ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా లోని సీటీమార్ సాంగ్ ను సల్మాన్ రాధే మూవీలో వాడారు. ఈ పాట వాడుకోనిచ్చినందుకు సల్లూ భాయ్ బన్నీకి థ్యాంక్స్ చెప్పడంతో పాటు మీ స్టెప్పులు అదిరిపోయానని కాంప్లిమెంట్ ఇచ్చాడు. మీ నుంచి ఇలాంటి ప్రశంస అందుకోవడం సంతోషమంటూ బన్నీ కూడా రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే బన్నీ హిందీలో మల్టీస్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడని, ఇందులో అల్లు అర్జున్‌తో పాటు హీరో షాహిద్ కపూర్ నటించనున్నారని ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వర్తతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.