Sreemukhi latest pics: స్టార్ యాంకర్ శ్రీముఖి బిజీ లైఫ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి వెకేషన్ లో సేద తీరుతుంది. ఇష్టమైన ప్రదేశంలో విహరిస్తోంది. శ్రీముఖి తన వెకేషన్ ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. రెడ్ ఫ్రాక్ లో అమ్మడు కిరాక్ లుక్ కట్టిపడేస్తుంది..
బుల్లితెరను ఏలేస్తుంది శ్రీముఖి(Anchor Sreemukhi). మెజారిటీ షోలలో ఆమె యాంకర్ గా ఉంటున్నారు. అనసూయ గ్యాప్ తీసుకోవడంతో పాటు, యాంకర్ సుమ షోలు తగ్గించడంతో శ్రీముఖికి తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతానికి టాప్ తెలుగు యాంకర్ అంటే శ్రీముఖి అనే చెప్పాలి. నటి కావాలని పరిశ్రమకు వచ్చిన శ్రీముఖి జులాయి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో చిన్న పాత్ర చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కూడా శ్రీముఖి ప్రాధాన్యత లేని ఓ పాత్ర చేసింది. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంతో మొదటిసారి లీడ్ రోల్ చేసింది. అయితే శ్రీముఖికి సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ రాలేదు.
Also Read: సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ వీడియో..పవన్ లుక్స్ మామూలుగా లేవుగా!
అందుకే బుల్లితెర వైపు అడుగులు వేసింది. అదుర్స్ షోతో అరంగేట్రం చేసింది. అయితే పటాస్ శ్రీముఖికి ఫేమ్ తెచ్చింది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో పటాస్ షో ఈటీవిలో ప్రసారమైంది. యాంకర్స్ గా రవి, శ్రీముఖి వ్యవహరించారు. తన ఎనర్జీతో పటాస్ షోకి ఆకర్షణగా నిలిచింది శ్రీముఖి. అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ముప్పైకి పైగా షోలు చేసింది. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం సక్సెస్ఫుల్ గా సాగుతుంది. అప్పుడప్పుడు నటిగా కూడా అదృష్టం పరీక్షించుకుంటుంది శ్రీముఖి.
2021లో విడుదలైన క్రేజీ అంకుల్స్ చిత్రంలో శ్రీముఖి లీడ్ రోల్ చేసింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. చివరిగా శ్రీముఖి భోళా శంకర్ చిత్రంలో కనిపించింది. ఆ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి చిత్రంలోని రొమాంటిక్ సీన్ ని చిరంజీవి-శ్రీముఖి స్పూఫ్ చేయడం విశేషం. భోళా శంకర్ ప్లాప్ కావడంతో శ్రీముఖికి గుర్తింపు రాలేదు.
Also Read: ఒకటి కాదు.. రెండు కాదు.. ‘50’ ఏళ్లు.. రజినీ మామూలోడు కాదు…
చెప్పాలంటే శ్రీముఖికి సిల్వర్ స్క్రీన్ అంతగా కలిసి రావడం లేదు. అందుకే ఆమె పూర్తి దృష్టి యాంకరింగ్ మీద పెట్టింది. అటు బుల్లితెర, ఇటు ఓటీటీ షోలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతుంది. ఆర్థికంగా సెటిల్ అయిన శ్రీముఖి హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకుంది. అక్కడే కుటుంబ సభ్యులతో ఉంటుంది. ప్రస్తుతం అమ్మడు వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. రెడ్ ఫ్రాక్ ధరించిన శ్రీముఖి గ్లామరస్ లుక్ వైరల్ గా మారింది. ఇక శ్రీముఖి పెళ్లిపై తరచుగా పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. థర్టీ ప్లస్ లో ఉన్న శ్రీముఖి అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటుంది.
View this post on Instagram