Largest Dolby Cinema Screen In Asia Hyderabad: హైదరాబాద్ లో ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు ఏషియన్ సినిమాస్ తో కలిసి పలు మల్టీ ప్లెక్స్ థియేటర్స్ ని నిర్మించారు. ప్రేక్షకులు ఈ థియేటర్స్ లో సినిమాలు చూసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. ఏ హీరో అభిమాని ఐటీ ఈ థియేటర్స్ లో సినిమాలు చూసేందుకే అధికంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అమీర్ పెట్ లో ఇప్పటికే AA సినిమాస్ ఉంది. ప్రఖ్యాత సత్యం టీహెయాత్రే ని పడగొట్టి, ఆ స్థానం లోకి ఈ భారీ మల్టీప్లెక్స్ ని తీసుకొచ్చారు. హైదరాబాద్ లో టాప్ 3 మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఇది కూడా ఒకటి. ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది ఈ మల్టీ ప్లెక్స్. ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో కోకాపేట్ లో అల్లు అర్జున్ మరో భారీ మల్టీప్లెక్స్ ని నిర్మించాడు.
Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి
తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి డాళ్బీ విజన్ స్క్రీన్స్ ని ఈ మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దేశం లో కేవలం పూణే , ముంబై లో మాత్రమే ఈ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇప్పుడు మూడవ డాళ్బీ థియేటర్స్ గా ‘అల్లు సినిమాస్’ నిల్చింది. అంతే కాదు , దేశం లోనే ‘అల్లు సినిమాస్ ‘ లో డాళ్బీ స్క్రీన్ అతి పెద్దదిగా చెప్తున్నారు. పూణే లోని సిటీ ప్రైడ్ లో ఉన్నటువంటుకి మొట్టమొదటి డీలాబీ సినిమాస్ స్క్రీన్ సైజు 55 అడుగుల వెడల్పు, 26.2
అడుగుల ఎత్తు ఉండగా , బెంగళూరు సిటీ లో రీసెంట్ గానే ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్ లో ఉన్న స్క్రీన్ సైజు 65 అడుగుల వెడలపుతో ఉంటుందట. కానీ అల్లు సినిమాస్ లో ఉన్నటువంటి డాళ్బీ స్క్రీన్ వెడలపు ఏకంగా 75 అడుగులు ఉంటుందట. ఇది DCI ఫ్లాట్ స్క్రీన్ అని సమాచారం.
మొత్తం మీద ‘అల్లు సినిమాస్ ‘ లో 4 స్క్రీన్స్ ఉంటాయట. స్క్రీన్ 1 డాళ్బీ విజన్ ఫార్మటు తో ఉంటుందని, సీటింగ్ కెపాసిటీ 644 అని అంటున్నారు. మిగిలినవి నార్మల్ స్క్రీన్స్ అట. ఈ నెల 19 న విడుదల కాబోతున్న రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2 : ది రివెంజ్ ‘ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ స్క్రీన్ కి మొదలు పెట్టారు. అదే రోజున విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఈ స్క్రీన్స్ లో త్వరలోనే ప్రారంబిస్తారట. మరి హైదరాబా