Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Son Gautam: నటుడిగా మహేష్ తనయుడు గౌతమ్ ఎంట్రీ.. యాక్టింగ్ అదిరిపోయిందిగా..వీడియో...

Mahesh Babu Son Gautam: నటుడిగా మహేష్ తనయుడు గౌతమ్ ఎంట్రీ.. యాక్టింగ్ అదిరిపోయిందిగా..వీడియో వైరల్!

Mahesh Babu Son Gautam: ఒకపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) రాజమౌళి ‘వారణాసి'(Varanasi Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు జార్జియా లో భారీ షెడ్యూల్ ని చేసిన ఈ మూవీ టీం , నేడే హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. త్వరలోనే ఇక్కడ వేసిన భారీ సెట్స్ లో షూటింగ్ చేయబోతున్నారు. అభిమానులు ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆత్రుతతో […]

Mahesh Babu Son Gautam: ఒకపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) రాజమౌళి ‘వారణాసి'(Varanasi Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు జార్జియా లో భారీ షెడ్యూల్ ని చేసిన ఈ మూవీ టీం , నేడే హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. త్వరలోనే ఇక్కడ వేసిన భారీ సెట్స్ లో షూటింగ్ చేయబోతున్నారు. అభిమానులు ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తుంటే, ఈలోపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ నటించిన షార్ట్ ఫిల్మ్ మూడు రోజుల క్రితం యూట్యూబ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ’14 డేస్’ అనే మూడు నిమిషాల 20 సెకండ్స్ నిడివి ఉన్న షార్ట్ ఫిలిం లో గౌతమ్ కనిపించాడు. ఈ షార్ట్ ఫిలిం కి గౌతమ్ స్నేహితుడు అలెక్స్ లక్ష్మి దర్శకత్వం వహించాడు. ఈ షార్ట్ ఫిలిం లో గౌతమ్ నటన కూడా ఆకట్టుకుంది.

Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి

ఇకపోతే ఈ షార్ట్ ఫిలిం లో అనూషే ధనేని హీరోయిన్ గా నటించింది. కిడ్నాప్ కి గురి కాబడిన ప్రియురాలి కోసం వెతుకుతూ హీరో పడే ఆవేదన నేపథ్యం లో ఈ చిత్రం సాగుతుంది. కిడ్నాపర్ ని ఎలా పట్టుకున్నాడు వంటి అంశాలు ఈ షార్ట్ ఫిలిం లో ఆసక్తిగా ఉండనున్నాయి. అయితే ఈ షార్ట్ ఫిలిం నిడివి చాలా తక్కువ ఉండడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. షార్ట్ ఫిలిం సగమే యూట్యూబ్ లో అప్లోడ్ చేశారా అనే అనుమానం కూడా అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే కథ మధ్యలోనే ఆగిపోయినట్టు అనిపించిందట. మరి పార్ట్ 2 లాంటివి ఏమైనా ప్లాన్ చేసారేమో చూడాలి. ప్రస్తుతం గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. త్వరలోనే ఆయన ఇండస్ట్రీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ షార్ట్ ఫిలిం వీడియో ని మీరు కూడా చూసేయండి.

ఇక మహేష్ బాబు నటిస్తున్న వారణాసి విషయానికి వస్తే, ఈ చిత్రం రాజమౌళి కెరీర్ లోనే అత్యంత వేగంగా పూర్తి అయ్యేదిగా చెప్తున్నారు. సెప్టెంబర్ నెలలోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టాయబోతున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతుంది కాబట్టి, హాలీవుడ్ లో కొన్ని ప్రముఖ మీడియా చానెల్స్ కి ఇప్పటికే ఇవ్వడం మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో ప్రొమోషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఏప్రిల్ 7 న గ్లోబల్ వైడ్ గా అన్ని భాషల్లోనూ విడుదల అవ్వబోతున్న ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper