Ram Charan: రామ్ చరణ్ సందీప్ వంగ కాంబో కోసం ఎదురుచూస్తున్న అభిమానులు…ఇది సాధ్యం అవుతుందా..?

సందీప్ రెడ్డి వంగా రామ్ చరణ్ కాంబినేషన్ లో కనక సినిమా పడితే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఎలాంటి క్యారెక్టర్ అయిన సరే అలవోకగా చేయగలరు.

Written By: Gopi, Updated On : July 4, 2024 9:51 am

Ram Charan

Follow us on

Ram Charan: మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ప్రస్తుతం ఈయన తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడానికి రెడీ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే అనిమల్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఒక సినిమా కనక చేయగలిగినట్టైతే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ చాలామంది రామ్ చరణ్ అభిమానులు కూడా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి సందీప్ రెడ్డి వంగా రామ్ చరణ్ కాంబినేషన్ లో కనక సినిమా పడితే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఎలాంటి క్యారెక్టర్ అయిన సరే అలవోకగా చేయగలరు. అలాగే సందీప్ రెడ్డివంగా కూడా తన హీరోకి ఒక సపరేటు క్యారెక్టరైజేషన్ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు కాబట్టి వీళ్ళ కాంబో లో ఒక సినిమా వస్తే చూడడానికి ప్రతి వ్యక్తి కూడా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఇంకా ఇప్పటికే సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమాతో ఎలాగైనా సరే తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు చేసిన అనిమల్ సినిమా 900 కోట్ల కలెక్షన్లు రాబట్టిన విషయం మనకు తెలిసిందే… సందీప్ ప్రస్తుతం స్పిరిట్ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో కనక భారీ హిట్ కొట్టగలిగినట్టైతే టాప్ డైరెక్టర్ గా తను ఎదుగుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇది ఇలా ఉంటే మొత్తానికైతే రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు కాకపోయినా మరో 2, 3 సంవత్సరాల్లో ఈ కాంబో లో ఒక సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది.. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఆల్మోస్ట్ సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…