బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం ‘లక్ష్మీబాంబ్’. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘కంచన’ మూవీ బాలీవుడ్లో ‘లక్ష్మీబాంబ్’గా రీమేక్ అవుతోంది. ఇందులో హీరోహీరోయిన్లుగా అక్షయ్ కుమార్.. కియరా అడ్వాణీ నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజైంది.
Also Read: ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను లైన్లో పెట్టిన త్రివిక్రమ్..!
‘కంచన’ మూవీలో హీరో నటించిన డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ‘లక్ష్మీబాంబ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. లారెన్స్ పాత్రలోనే అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. శుక్రవారం రిలీజైన ‘లక్ష్మీబాంబ్’ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అక్షయ్ కుమార్ నటన సినిమాకు హైలెట్ నిలువడం ఖాయంగా కన్పిస్తోంది. కియరా అడ్వానీ గ్లామర్ సినిమాకు ప్లస్ కానుంది.
ఈ సినిమా ట్రైలర్ విషయంలో ‘లక్ష్మీబాంబ్’ చిత్రయూనిట్ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు కన్పిస్తోంది. సాధారణంగా ట్రైలర్ కు వచ్చే లైక్స్.. డిలైక్స్.. షేర్స్ ఆధారంగా సినిమా ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అయిందో తెలుసుకోవడం కామన్ అయిపోయింది. అయితే ‘లక్ష్మీబాంబ్’ విషయంలో మాత్రం మేకర్ లైక్స్.. డిస్ లైక్స్.. షేర్స్ కౌంట్ డిసబుల్ చేయడం చర్చనీయాంశం మారింది.
ఈ ట్రైలర్ కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసిన కౌంట్ చూపించకపోవడంతో అభిమానులకు నిరుత్సాహం చెందుతున్నారు. అయితే చిత్రయూనిట్ అతిజాగ్రత్త వల్లే ఇలా అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలో నెపోటిజం విమర్శలు పెరిగిపోయాయి. నెటిజన్లు బాలీవుడ్ హీరోలు.. హీరోయిన్ల సినిమాలకు డిస్ లైక్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
Also Read: మహేష్ సినిమా పై విజయ్ దేవరకొండ కామెంట్స్ !
ఇటీవల ఆలియాభట్ నటించిన ‘సడక్-2’ ట్రైలర్ రిలీజ్ కాగా నెటిజన్లు డిస్ లైక్ లతో హోరెత్తించారు. అదేవిధంగా మరో స్టార్ కిడ్ అననయ్య పాండే నటించిన ‘ఖాలిపీలి’ ట్రైలర్ విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో ‘లక్ష్మీబాంబ్’ చిత్రయూనిట్ ముందస్తు జాగ్రత్తగా లైక్స్.. డిస్ లైక్స్.. కామెంట్ల బాక్స్ డిసబుల్ చేసింది. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ పై ఎలాంటి నెపోటిజం ఆరోపణలు లేకున్నప్పటికీ ‘లక్ష్మీబాంబ్’ విషయంలో చిత్రయూనిట్ ఇలా చేయడంపై అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు.