L2 Empuraan : ఉగాది,రంజాన్ కానుకగా విడుదలైన మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ‘L2 :ఎంపురాన్'(L2:Empuraan) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తూ ముందుకు వెళ్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. తెలుగు వెర్షన్ లో ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేశాడు. దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తే కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే ఇప్పటి వరకు వచ్చాయి. దాదాపుగా ఇది క్లోజింగ్ వసూళ్లు అనుకోవచ్చు. కానీ మలయాళం వెర్షన్ లో మాత్రం అన్ స్టాపబుల్ అనే రేంజ్ లోనే ముందుకు దూసుకుపోతుంది. నెగటివ్ టాక్ మీదనే ఈ రేంజ్ వసూళ్లు అంటే, ఇక పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే ఏ రేంజ్ వసూళ్లు వచ్చేవో అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : 48 గంటల్లో 120 కోట్లు..చరిత్ర సృష్టించిన మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం. ఈ సినిమా వసూళ్ల గురించి మాట్లాడుకోవాలంటే, కచ్చితంగా ఓవర్సీస్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఆ ప్రాంతం నుండి ఈ సినిమా 13 రోజుల్లో 140 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఎన్నో తెలుగు, తమిళ సినిమాలకు కూడా ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు రాలేదు. ఓవరాల్ వరల్డ్ వైడ్ వంద కోట్ల రూపాయిల గ్రాస్ వస్తేనే ఇండస్ట్రీ హిట్ గా భావించే మలయాళం ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమాకు, కేవలం ఓవర్సీస్ నుండి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది చిన్న విషయమా?, భవిష్యత్తులో ఈ రికార్డుని అందుకోవడం టాలీవుడ్ హీరోలకు కూడా పెద్ద టాస్క్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే, కేరళ రాష్ట్ర నుండి ఈ చిత్రం ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన మొట్టమొదటి సినిమాగా నిలబడబోతుంది. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 81.20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో వంద కోట్ల మార్కుకి చాలా దగ్గరగా వెళ్లనుంది ఈ చిత్రం. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 13 రోజుల్లో 258 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 122 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అన్ని భాషలకు కలిపి ఈ చిత్రానికి విడుదలకు ముందు వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి, ఫుల్ రన్ లో మరో 15 కోట్ల రూపాయిల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి.
Also Read : 5 రోజుల్లో 200 కోట్లు..ఓవర్సీస్ లో ‘L2 : ఎంపురాన్’ సరికొత్త బెంచ్ మార్క్!