Allu Arjun : నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రకటనకు సంబంధించిన వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ అట్లీ(Director Atlee) తన డ్రీం ప్రాజెక్ట్ గా భావించి ఎన్నో ఏళ్ళు కష్టపడి సిద్ధం చేసుకున్న సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. కమర్షియల్ సినిమాలు చేసుకునే అట్లీ లో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అని నిన్న ఆ విడుదల చేసిన ఆ వీడియో ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు నెటిజెన్స్. కేవలం ప్రకటన విడియోతోనే సోషల్ మీడియా లో సునామీ ని సృష్టించింది ఈ కాంబినేషన్. హాలీవుడ్ తరహా క్వాలిటీ తో ఇలా కదా ఒక పాన్ ఇండియన్ సినిమాని ప్రకటించే విధానం అని సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానులు అసూయ పడ్డారు.
Also Read : లోలా ‘VFX’ ప్రత్యేకతలు ఏమిటి..? అల్లు అర్జున్ కి ఎందుకు అంత ఆసక్తి?
ఈ ప్రకటన వీడియో కి యూట్యూబ్ లో 34 లక్షలకు పైగా వ్యూస్ 24 గంటలు గడవక ముందే వచ్చాయి. అదే విధంగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలను కలిపి చూస్తే మరో 30 లక్షల వ్యూస్. ఓవరాల్ గా అన్ని కలిపి 64 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని సన్ పిక్చర్స్ సంస్థ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. టీజర్ కి వచ్చిన రేంజ్ లో ఈ సినిమాకు రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు. ఈ సినిమాపై ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం కేవలం ప్రమోషనల్ కంటెంట్ తో ఇంకా ఏ రేంజ్ అంచనాలను రేకెత్తిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా లెవెల్ లో కాదు, అంతర్జాతీయ స్థాయిలో అన్ని భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ మరియు సూపర్ హీరో జానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇండియా లో ఇప్పటి వరకు సూపర్ హీరో కాన్సెప్ట్ మీద హృతిక్ రోషన్(Hrithik Roshan) ‘క్రిష్’ సిరీస్ ఒక్కటే వచ్చింది. ఇప్పుడు ఈ క్రేజీ చిత్రం కూడా రానుంది. అల్లు అర్జున్ ఇలాంటి సబ్జెక్టు ని ఎంచుకున్నాడంటే, కచ్చితంగా బలమైన స్టోరీ లైన్ తోనే వస్తున్నారని అనుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఏ రేంజ్ కి వెళ్లబోతుంది అనేది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు, విలన్ గా ఎవరు ఉండబోతున్నారు, మిగిలిన నటీనటులు ఎవరు అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే ఇందులో హీరో , విలన్ రెండు కూడా అల్లు అర్జునే అనే టాక్ నడుస్తుంది, చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అనేది.
Also Read : కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు..ఫోటోలు వైరల్!