L2 Empuraan : మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘L2: ఎంపురాన్'(L2: Empuraan) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ చిత్రానికి అభిమానుల అంచనాలకు తగ్గ పాజిటివ్ టాక్ అయితే కచ్చితంగా రాలేదు. మొదటి రోజు డివైడ్ టాక్ చాలా గట్టిగానే వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ స్థాయి థియేట్రికల్ రన్ రావడం అనేది మామూలు విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 262 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక మలయాళం సినిమాకి ఇంత వసూళ్లా?, కనీసం కలలో అయినా ఇంత వస్తుందని ఊహించామా అంటూ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. కానీ తెలుగు వెర్షన్ లో మాత్రం నెగటివ్ టాక్ ప్రభావం చాలా గట్టిగా పడింది.
Also Read : ఆ ప్రాంతంలో 140 కోట్లు రాబట్టిన ‘L2:ఎంపురాన్’..టాలీవుడ్ హీరోలకు చుక్కలే!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. కానీ 15 రోజుల్లో ఈ చిత్రానికి వచ్చింది కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే. తక్కువ రేట్ కి బిజినెస్ చేసుంటే బాగుండేది అని వసూళ్లు చూసిన తర్వాత అందరూ అంటున్నారు. ఇక్కడ మిస్ ఫైర్ అవ్వడానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే పాజిటివ్ టాక్ పూర్తి స్థాయిలో రాలేదు అనేది ప్రధాన కారణం కాగా, లూసిఫర్ చిత్రానికి మన దగ్గర పెద్దగా క్రేజ్ లేకపోవడం మరో ప్రధాన కారణం. భారీ హైప్ ఉండుంటే, కచ్చితంగా ఈ చిత్రం ఇక్కడ కూడా టాక్ తో సంబంధం లేకుండా కేవలం వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి ఉండేది. కానీ విడుదలకు ముందు మన రాష్ట్రాల్లో బజ్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల పెద్ద దెబ్బ పడిందనే అనుకోవచ్చు.
కానీ మలయాళం వెర్షన్ మాత్రం సునామీ ని తలపించింది అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రాంతం లో ఈ చిత్రానికి 15 రోజుల్లో 142 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కేరళ రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 83 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ ఈ చిత్రానికి అత్యంత కీలకం కానుంది. 300 కోట్ల రూపాయిల గ్రాస్ మార్క్ కి దగ్గరగా ఈ వీకెండ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా 320 నుండి 340 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. డివైడ్ టాక్ మీదనే ఈ రేంజ్ వసూళ్లు వస్తే, ఇక పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే ఏ రేంజ్ వసూళ్లు వచ్చేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read : ‘L2 : ఎంపురాన్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..300 కోట్లకు అతి చేరువలో!