RCB Vs DC IPL 2025: ఓపెనర్లు విరాట్ కోహ్లీ, సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయినప్పటికీ.. ఆ తర్వాత వికెట్లు వెంట వెంటనే పడడంతో బెంగళూరు జట్టు టాప్ ఆర్డర్ సొంతమైదానంలో పేక మేడను తలపించింది. కీలకమైన ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దేవదత్ పడిక్కల్(1), జితేష్ శర్మ (3), లివింగ్ స్టోన్ (4) దారుణంగా విఫలమయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరు ముగ్గురు చేతులెత్తేయడంతో బెంగళూరు స్కోరు 200 మార్క్ కూడా చేరుకోలేకపోయింది.. 163 పరుగుల వద్దే ఆగిపోయింది. వాస్తవానికి బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వేగానికి.. 300 పరుగులకు మించి చేయాల్సి ఉండేది. కానీ మెరుపు ఆరంబాన్ని ఆ జట్టు ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివరికి ఢిల్లీ జట్టు ఎదుట 164 పరుగుల టార్గెట్ మాత్రమే విధించారు. అయితే ఈ టార్గెట్ ను ఢిల్లీ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేదించింది. కేఎల్ రాహుల్ , స్టబ్స్ ఐదవ వికెట్ కు 111* పరుగుల అనితర సాధ్యమైన భాగస్వామ్యం నిర్మించారు… వీరిద్దరి దూకుడు వల్ల ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.. 17.5 ఓవర్ లోనే టార్గెట్ ఫినిష్ చేసింది. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది.
Also Read: హేజిల్ వుడ్ కు చుక్కలు.. స్టబ్స్ తో కలిసి మెరుపులు.. కేఎల్ రికార్డులు ఇవి..
ఆరంభ శూరత్వం లాగా..
ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఆరంభ శూరత్వం లాగా ఆడింది. బ్యాటింగ్లో తొలి నాలుగో ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. తర్వాత పేక మేడ సామెతను టాప్ ఆర్డర్ నిరూపించింది.. ఇక బౌలింగ్ లోనూ 50 పరుగుల లోపే ఢిల్లీ జట్టుకు సంబంధించి కీలకమైన నాలుగు వికెట్లను పడగొట్టింది. అయితే ఈ దశలో అదే ఊపును చివరి వరకు కొనసాగించలేకపోయింది. దీంతో రాహుల్, స్టబ్స్ పాతుకు పోయారు. బెంగళూరు జట్టుకు కొరకరాని కొయ్యలాగా మారారు. అంతిమంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ఈ ఓటమి ద్వారా బెంగళూరు అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో అత్యధికంగా 40 ఐదు సార్లు ఓటమిపాలైన జట్టుగా నిలిచింది. భారీగా అభిమానులు హాజరై.. సపోర్ట్ ఇచ్చే సొంత మైదానంలోనే బెంగళూరు ఇలా ఆడటంపై అభిమానులు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై తర్వాత సొంత మైదానాలలో ఓడిపోయిన జట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో 44 సార్లు, కోల్ కతా నైట్ రైడర్స్ సొంత మైదానంలో 38 సార్లు, ముంబై ఇండియన్స్ సొంత మైదానంలో 34 సార్లు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంత మైదానంలో 30 సార్లు ఓటమిపాలయ్యాయి. బెంగళూరు జట్టు సొంత మైదానంలోనే ఓడిపోవడానికి ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: కేఎల్ రాహుల్ భయ్యా నీకో దండం.. నిజంగా నువ్వు దూతవే..