L2 Empuraan Collection
L2 Empuraan Collection: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘L2 : ఎంపురాన్'(L2: Empuraan) బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతాన్ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు వస్తున్న గ్రాస్ వసూళ్లు భవిష్యత్తులో తెలుగు, హిందీ సినిమాలకు పెద్ద సవాల్ గా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే మలయాళం మార్కెట్ ని శిఖరాగ్ర స్థాయికి చేర్చింది అనే చెప్పాలి. కేరళలో ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యినప్పటికీ 50 రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వస్తాయి. కానీ ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ళవైపు పరుగులు తీస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వసూళ్లు కేరళ ప్రాంతం నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ దుమ్ములేపేస్తుంది కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్…
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత వసూళ్లు ఈ పది రోజుల్లో వచ్చాయో ఒకసారి చూద్దాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, పది రోజులకు కలిపి కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, నాలుగు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఈ చిత్రం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. అదే విధంగా కేరళలో ఈ చిత్రానికి పది రోజులకు గాను 78 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే ఇది కేరళ రాష్ట్రంలో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అదే విధంగా తమిళనాడు లో ఈ చిత్రానికి 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 141 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. సౌత్ నుండి ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు ఓవర్సీస్ లో రాబట్టినవి చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 252 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నేడు శ్రీరామ నవమి కావడంతో వసూళ్ళలో భారీ జంప్ వచ్చింది. నేడు ఒక్క రోజే ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిన్న బుక్ మై షో లో ఈ చిత్రానికి దాదాపుగా 93 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి, నేడు ఈ చిత్రానికి లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.