Mad Square : యూత్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసిన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie) చిత్రం ఉగాది కానుకగా విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఓపెనింగ్స్ లో వచ్చినంత ఊపుని లాంగ్ రన్ లో చూపించలేవు. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం కూడా ఆ క్యాటగిరీకి చెందిన సినిమానే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓపెనింగ్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది. కానీ ఐదవ రోజు నుండి క్రమంగా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. మళ్ళీ వీకెండ్ లో వసూళ్లు పుంజుకున్నాయి. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్, డీసెంట్ లాంగ్ రన్ అని చెప్పొచ్చు. కేవలం యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని తీసిన చిత్రం, ఆ యూత్ ఆడియన్స్ లో కూడా కాస్త డివైడ్ టాక్ రావడం వల్లనే ఆశించిన స్థాయి గ్రాస్ వసూళ్లు రాలేదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.
Also Read : మ్యాడ్ స్క్వేర్’ 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇక కష్టమే!
విడుదలై రెండు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా ఈ కథనం లో చూడబోతున్నాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 14 రోజున 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు 48 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 14 రోజులకు గానూ 37 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 67 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ కి 15 కోట్ల రూపాయిల లాభాలు ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఇప్పటికీ ఈ సినిమాకు డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి.
రెండు వారాల్లో ఈ చిత్రానికి అక్కడ 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. నైజాం ఆడియన్స్ ఒక సినిమాని అంత తేలికగా నచ్చరు, ఒకవేళ నచ్చితే మాత్రం హీరోలు ఎవరు అనేది కూడా చూడరు, బ్రహ్మరథం పడుతారు అనడానికి ఇదొక మరో ఉదాహరణగా భావించవచ్చు. అదే విధంగా సీడెడ్ లో 3 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర లో 3 కోట్ల 70 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రెండు కోట్ల 25 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి 22 లక్షలు, గుంటూరు జిల్లాలో 2 కోట్ల 10 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 75 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 3 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్+ కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ 10 రోజుల వసూళ్లు..ఎన్టీఆర్ మాస్ వల్ల ఇంత గ్రాస్ వచ్చిందా!