KVN Productions crisis: ఏ ముహూర్తం లో ప్రారంభించారో కానీ, KVN ప్రొడక్షన్స్ సంస్థ కు అడుగడుగునా ఇబ్బందులే పాపం. చేతిలో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ డేట్స్ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ ఒక్క సినిమా కూడా విడుదల చేసుకోలేని పరిస్థితి లో ఉన్నారు. ‘జన నాయగన్ ‘ చిత్రాన్ని నిర్మించినది వీళ్ళే. తమిళ సూపర్ స్టార్ విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై మార్కెట్ లో క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం , సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. అంతకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే ప్రపంచవ్యాపంగా ఈ చిత్రానికి 70 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా విడుదలైతే ఏ రేంజ్ సునామీ ని సృష్టించి ఉండేదో అనేది.
ఇప్పటికీ సెన్సార్ ఇక్కట్లు తొలగలేదు. ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఆ కారణం చేత అడ్వాన్స్ లు ఇచ్చిన ప్రతీ ఒక్కరు నిర్మాత మీద ఒత్తిడి చేయడం తో ఆ డబ్బులు తిరిగి ఇచేయాల్సి వచ్చింది. మరో పక్క ఫైనాన్షియర్స్ నుండి ఒత్తిడి మామూలు రేంజ్ లో లేదు. ఈ సినిమా కారణంగా ఆర్ధిక సంక్షోభం ఎదురు అవ్వడంతో చిరంజీవి , బాబీ కాంబినేషన్ తెరకెక్కాల్సిన మూవీ కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎప్పుడో జనవరి నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అవ్వాలి. కానీ డబ్బులు రొటేషన్ లేకపోవడం తో ఆగాల్సి వచ్చింది. కనీసం ‘టాక్సిక్ ‘ సినిమా విడుదల అయితే ఈ నిర్మాతకు వచ్చిన ఇక్కట్లు తొలుగుతాయేమో అని అంతా అనుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు , మంచి క్రేజ్ ఉంది.
Also Read: ‘ధురంధర్ 2’ సునామీ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తట్టుకోగలదా..? తేడా జరిగితే పరువు పోయినట్టే!
మార్చి 19 న గ్రాండ్ గా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కూడా ఇప్పుడు వాయిదా పడింది. జూన్ 5 న విడుదల చేస్తామని మేకర్స్ నిన్న అధికారిక ప్రకటన చేశారు. ఇవి కాకుండా కన్నడ లో ధృవ్ సర్జా హీరో గా తెరకెక్కుతున్న ‘కేడీ’ మూవీ షూటింగ్ ముందుకు కదలడం లేదు. చాలా రోజుల నుండి సెట్స్ మీదనే ఉంది. ఇలా చేతిలో ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టుకొని కూడా విడుదల చేసుకోలేని పరిస్థితి. దేశంలో ఇప్పటి వరకు ఏ నిర్మాతకు కూడా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఏర్పడలేదు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురు అవ్వబోతున్నాయో చూడాలి.