Homeఎంటర్టైన్మెంట్Karuppu Teaser Review: కురుప్పు టీజర్ రివ్యూ: సూర్య ఈసారి ఊరమాస్! అదే హైలెట్!

Karuppu Teaser Review: కురుప్పు టీజర్ రివ్యూ: సూర్య ఈసారి ఊరమాస్! అదే హైలెట్!

Karuppu Teaser Review: ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న సూర్యకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. ఈ క్రమంలో తనకు అచ్చొచ్చిన మాస్ యాంగిల్ ఎంచుకున్నాడు. కురుప్పు చిత్రంలో ఆయన అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ చేస్తున్నారు. కురుప్పు టీజర్(KURUPPU TEASER) విడుదల కాగా… ఎలా ఉందో చూద్దాం..

Also Read: ఇద్దరు దర్శకులు కలిసి చేసిన హరిహర వీరమల్లు మూవీ పరిస్థితి ఏంటి..?

సూర్య(SURIYA) మంచి నటుడు. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన గజినీ చిత్రంతో తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. సూర్య చిత్రాలకు టాలీవుడ్ లో మార్కెట్ ఉంది. ఆయన ప్రతి చిత్రం ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తారు. గజినీ ప్రయోగాత్మక చిత్రం. గొప్ప విజయాన్ని అందుకుంది. అనంతరం సూర్య చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. సెవెన్త్ సెన్స్, 24, కంగువా సూర్య చేసిన భారీ ప్రయోగాలు. వీటిలో ఒక్కటి కూడా ఆడలేదు.

కంగువా సూర్యకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సూర్య కెరీర్ లోనే కంగువా అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. సూర్య చివరి చిత్రం రెట్రో ఎప్పుడు వచ్చి పోయిందో కూడా తెలియదు. సూర్య వంటి స్టార్ కి ఈ రేంజ్ డిజాస్టర్స్ ఊహించనివే. దశాబ్దకాలంగా సూర్యకు సరైన కమర్షియల్ హిట్ లేదు. సూరారైపోట్రు నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఇది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓటీటీ చిత్రం కావడంతో కమర్షియల్ హిట్ అని చెప్పలేము. సూరారైపోట్రు, జై భీమ్ నటుడిగా సూర్యకు పేరు తెచ్చాయి.

సూర్యకు మాస్ కమర్షియల్ సబ్జక్ట్స్ గ్యారంటీ విజయాలు అందించాయి. సింగం సిరీస్ లో ప్రతి సినిమా తెలుగులో కూడా ఆదరణ పొందింది. ఈ విషయాన్ని లేటుగా గ్రహించిన సూర్య ప్రయోగాలను పక్కన పెట్టి కురుప్పు టైటిల్ తో మాస్ కమర్షియల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కురుప్పు టీజర్ చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. టీజర్ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్, పంచ్ డైలాగ్స్ తో సాగింది. రెండు భిన్నమైన రోల్స్ లో సూర్య కనిపించాడు.

Also Read: SSMB 29కి బ్రేక్… మహేష్, రాజమౌళి ఏం చేస్తున్నారో తెలుసా?

సూర్యగా లాయర్ గెటప్ లో కనిపిస్తున్న హీరో… కురుప్పు గా మాస్ గెటప్ లో మెస్మరైజ్ చేశాడు. ఈ చిత్రంలో సూర్య… కురుప్పు, సూర్యగా అలరించనున్నాడని అర్థం అవుతుంది. సూర్యకు జంటగా త్రిష నటిస్తుంది. కురుప్పు చిత్రానికి ఆర్ జే బి దర్శకుడు. సాయి అభయంకర్ మ్యూజిక్ అందించారు. మరి కురుప్పు చిత్రంతోనైనా సూర్య హిట్ కొడతాడేమో చూడాలి..

RELATED ARTICLES

Most Popular