https://oktelugu.com/

టీజర్ టాక్: సైంటిఫిక్ క్రైమ్ ‘కుడి ఎడమైతే’

ఓటీటీలు వచ్చాక ప్రేక్షకుల అభిరుచి మారింది. పాత చింతకాయ పచ్చడి కథలు వారికి నచ్చడం లేదు. సమ్ థింగ్ కొత్తగా ఉండాలని వారు ఆలోచిస్తున్నారు. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు పెడితే ప్రేక్షకులు చూసే రోజులు పోయాయి. ఏదైనా కొత్త కథ, కథనం ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు. అలాంటి కథలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ టైమ్ […]

Written By: , Updated On : July 3, 2021 / 11:51 AM IST
Follow us on

ఓటీటీలు వచ్చాక ప్రేక్షకుల అభిరుచి మారింది. పాత చింతకాయ పచ్చడి కథలు వారికి నచ్చడం లేదు. సమ్ థింగ్ కొత్తగా ఉండాలని వారు ఆలోచిస్తున్నారు. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు పెడితే ప్రేక్షకులు చూసే రోజులు పోయాయి. ఏదైనా కొత్త కథ, కథనం ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు. అలాంటి కథలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ టైమ్ లూప్ హోల్ తో క్రైమ్ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైలర్ ను రూపొందించారు.

ఈ ట్రైలర్ చూస్తే ‘ఒక ప్రమాదం మళ్లీ మళ్లీ వరుసగా తమ జీవితంలో జరిగినట్టు అనిపిస్తుంది’.. మీకు ఎప్పుడైనా జరిగిందే లైఫ్ లో మళ్లీ మళ్లీ జరిగినట్టు అనిపించిందా? అన్న మెయిన్ థీమ్ తో ఈ సినిమా రూపొందించినట్టుగా తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్ కు లూసియా, యూటర్న్ వంటి థ్రిల్లింగ్ హిట్ చిత్రాలు తీసిన ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంల వహించారు. అమలాపాల్ తన కెరీర్ లో తొలిసారిగా పోలీస్ గా కనిపిస్తున్నారు. యంగ్ హీరో రాహుల్ విజయ్, రవిప్రకాష్, ప్రదీప్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 16నుంచి ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్కాబోతోంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో దీన్ని విడుదల చేస్తున్నారు.

Kudi Yedamaithe Teaser | Amala Paul, Rahul Vijay, Pawan Kumar | People Media | Premieres July 16