Kuberaa: తెలుగులో స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. డాలర్ డ్రీమ్స్, ఆనంద్, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, అనామిక వంటి సినిమాలు తీసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. చాలాకాలం తర్వాత శేఖర్ కమ్ముల ధనుష్, నాగార్జున, రష్మిక కాంబినేషన్లో కుబేర అనే సినిమా తీశారు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. జనాలకు ఆశించిన స్థాయిలో నచ్చలేదు. ఈ సినిమా ఇటీవల స్టార్ మా లో వరల్డ్ ప్రీమియర్ గా ప్రసారమైంది.
స్టార్ మా కు విపరీతమైన రీచ్ ఉంటుంది కాబట్టి.. ఈ సినిమాకు రేటింగ్స్ కూడా బాగానే వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదు. తాజాగా విడుదలైన బార్క్ రేటింగ్స్ ప్రకారం.. కుబేర సినిమాకు అర్బన్ ఏరియాలో 8.8 టిఆర్పి నమోదయింది. అర్బన్, రూరల్ ఏరియాలలో 7.24 టీఆర్పీ వచ్చింది.. ఇప్పటికీ స్టార్ మా లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా రిపీటెడ్ గా వేసినా 6 టిఆర్పి రేటింగ్స్ వస్తుంటాయి. కానీ కుబేర సినిమా 8 టిఆర్పి రేటింగ్స్ దగ్గరే ఆగిపోవడం విశేషం.
కుబేర సినిమాల ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. సెకండాఫ్ సాగదీత మాదిరిగా అనిపించింది. నాగార్జునను నెగిటివ్ యాంగిల్ లో చూపించినప్పటికీ.. పూర్తిస్థాయిలో శేఖర్ కమ్ముల వాడుకోలేదు. రష్మిక పాత్ర చుట్టపు చూపుకు పరిమితమైంది. అన్నిటికంటే ముఖ్యంగా శేఖర్ కమ్ముల రైటింగ్ ఇందులో మిస్సయింది. పాత్రల మధ్య భావోద్వేగాలు లేకపోవడంతో కుబేర సినిమా రొటీన్ చిత్రంగానే మిగిలిపోయింది.
నేటి కాలంలో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అపరిమితమైన డాటా.. అంతకుమించిన ఓటీటీ లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎవరూ టీవీలను అంతగా చూడడం లేదు. కుబేర రేటింగ్స్ డౌన్ ఫాల్ కావడానికి ఇవి కూడా ఒక కారణాలు. ఇక ఇదే ఆదివారం జెమినీలో అల్లు అర్జున్ అలవైకుంఠపురం లో, ఓదెల 2 సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి. ఇందులో అల వైకుంఠపురంలో అర్బన్ ఏరియాలో 4.42, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలలో 4.53 టీఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంది. ఓదెల 2 సినిమాకు అర్బన్ ఏరియాలో 4.32, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 3.21 రేటింగ్స్ వచ్చాయి.
జెమినీ టీవీలో ఈ స్థాయి రేటింగ్స్ రావడం నిజంగా ఆశ్చర్యకరమే. ఎందుకంటే కొంతకాలంగా జెమినీ టీవీలో ఏ సినిమా కూడా 5 కు మించి రేటింగ్స్ సొంతం చేసుకోవడం లేదు. అలాంటిది అలవైకుంఠపురంలో సినిమా రిపీటెడ్ గా టెలికాస్ట్ చేసినప్పటికీ ఈ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయంటే నిజంగా ఆశ్చర్యకరమే.