Kantara 2 OG theaters: ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు కాకుండా ట్రేడ్ కి మంచి బూస్ట్ ని ఇచ్చిన చిత్రాలు ‘ఓజీ'(They Call Him OG), ‘కాంతారా 2′(Kantara : The Chapter 1). వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ ని సంక్షోభం నుండి కాపాడిన సినిమాలు ఇవి. ఓజీ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టిస్తే, కాంతారా 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. థియేటర్స్ లో ఈ రెండు చిత్రాలు విజయవంతంగా నడుస్తున్నప్పటికీ, దీపావళి కి కొత్తగా నాలుగు సినిమాలు విడుదల అవుతుండడం తో ఈ రెండు చిత్రాలకు థియేటర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిపోయాయి. ఓజీ చిత్రం ఇంకా కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంది. అదే విధంగా కాంతారా 2 కూడా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దూరం లో ఉన్నది.
ఈ రెండు సినిమాలు టార్గెట్ ని చేరుకోవాలంటే, కచ్చితంగా దీపావళి కి గణనీయమైన థియేటర్స్ ని హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కొత్త సినిమాలు కారణంగా థియేటర్స్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న విడుదలైన ‘మిత్రమండలి’ చిత్రం, నేడు విడుదలైనా ‘తెలుసు కదా’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ టాక్స్ ని సొంతం చేసుకున్నాయి. ఒక్క ‘డ్యూడ్’ చిత్రం మాత్రమే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే మిత్రమండలి చిత్రానికి ఎప్పుడైతే డిజాస్టర్ టాక్ వచ్చిందో, అప్పుడే ఓజీ కి ఆ సినిమాకు కేటాయించిన థియేటర్స్ ని ఇచ్చేశారు. అదే విధంగా కాంతారా 2 కి కూడా జరిగింది. ఇక నేడు విడుదలైన రెండు సినిమాల్లో తెలుసు కదా కి ఫ్లాప్ టాక్ రావడం, ఓపెనింగ్స్ దారుణంగా ఉండడం తో ఈ ఓజీ, కాంతారా లకు థియేటర్స్ ని ఇచ్చేశారు.
ఇక రేపు విడుదలయ్యే కిరణ్ అబ్బవరం K ర్యాంప్ చిత్రం కూడా పొరపాటున ఫ్లాప్ అయితే, ఇక దీపావళి మొత్తం ఓజీ, కాంతారా 2 చిత్రాలే హల్చల్ చేస్తాయి. వీటితో పాటు డ్యూడ్ చిత్రం కూడా ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో అనేది. ఓజీ చిత్రం బ్రేక్ ఈవెన్ కి దగ్గర్లో ఉన్న సెంటర్స్ దీపావళి లోపు సేఫ్ అవ్వోచ్చేమో కానీ, కాంతారా 2 తెలుగు వెర్షన్ సేఫ్ అవ్వాలంటే ఇంకా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా?, కొంతవరకు రీ కవర్ అవ్వోచ్చేమో కానీ, పూర్తి స్థాయిలో కాంతారా 2 బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమని అంటున్నారు విశ్లేషకులు.