Kubera Movie: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం రెండు వారాల థియేట్రికల్ రన్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. కొత్త సినిమాలు విడుదల అయ్యినప్పటికీ, ఆడియన్స్ కి మొదటి ఛాయస్ గా కుబేర నే ఉండడం ఈ సినిమాకు లాంగ్ రన్ లో స్టడీ కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. 14 వ రోజున ఈ చిత్రం 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నిన్న గాక మొన్న విడుదలైన ‘కన్నప్ప’ రోజువారీ కలెక్షన్స్ కంటే ఇది చాలా ఎక్కువ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాలకు కలిపి 37 కోట్ల 69 లక్షల షేర్ వసూళ్లు, 63 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా ఓవర్సీస్ లో 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు , తమిళ నాడు లో 20 కోట్ల రూపాయిలు, కర్ణాటకలో 11 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేరళ లో కోటి 25 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రెండు కోట్ల 80 లక్షలు ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే నైజాం ప్రాంతంలో ఈ చిత్రం 16 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. హరి హర వీరమల్లు వచ్చే వరకు వేరే సినిమా రిలీజ్ లేదు. నేడు విడుదలైన నితిన్ తమ్ముడు చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కాబట్టి ఈ చిత్రానికి నైజాం లో అప్పటి వరకు లాంగ్ రన్ వస్తుందని, ఫుల్ రన్ లో 20 కోట్ల మార్కుని టచ్ అవుతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
Also Read: కన్నప్ప మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..70 శాతం కి పైగా నష్టాలు తప్పేలా లేదు!
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే సీడెడ్ లో 4 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర లో 6 కోట్ల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్ల 75 లక్షలు, వెస్ట్ గోదావరి లో కోటి 64 లక్షలు, గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 30 లక్షలు, కృష్ణ జిల్లాలో 2 కోట్ల 28 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 22 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఇప్పటి వరకు 3 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ ఎదురుకుంటున్న కరువుకు ఇది చాలా తక్కువ మొత్తం లాభమే. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ఈరోజు లేదా రేపటితో ఆ మార్కుని దాటనుంది ఈ చిత్రం.