Anchor To Actress: ఈ ఫొటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. మొదట్లో ఈమె తన కెరీర్ ని యాంకరింగ్ ద్వారానే ప్రారంభించింది. అలా యాంకరింగ్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభం లో సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే ఈమెను వరించేవి. కానీ ఆ తర్వాత చిన్నగా హీరోయిన్ క్యారెక్టర్స్ మొదలు సౌత్ లోనే టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా మారింది. కానీ విభిన్నమైన క్యారెక్టర్స్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఈమధ్య ఎక్కువగా ఈమె లేడీ విలన్ క్యారెక్టర్స్ లో కనిపిస్తుంది. లేడీ విలన్ గా ఆమె రీసెంట్ గా వచ్చిన సినిమాలో కూడా నట విశ్వరూపం చూపించేసింది. ఆమె మరెవరో కాదు, రెజీనా కాసాండ్రా(Regina Cassandra).
Also Read: ఏందమ్మీ ఈ అందాలు..మెస్మరైజింగ్ లుక్స్, కవ్వించే కైపులతో కెవ్వు కేక అనేలా అనసూయ
2005 వ సంవత్సరం లో ఈమె తమిళం లో తెరకెక్కిన ‘కంద నాల్ ముదాల్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఇందులో ఈమె ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది అంతే. ఆ తర్వాత తమిళం లో మరో సినిమా, కన్నడ లో మరో సినిమా చేసింది. పెద్దగా గుర్తింపు రాలేదు. అలా కెరీర్ సాగుతున్న సమయంలో ఈమెకు 2012 వ సంవత్సరం లో సుధీర్ బాబు మొదటి చిత్రం ‘శివ మనసులో శృతి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద రేంజ్ లో ఆడలేదు కానీ, పాటలు పెద్ద హిట్ అయ్యాయి. రెజినా కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది.
Also Read: బోల్డ్ తక్కువ బ్యూటీ ఎక్కువ. చీరలో కూడా బొడ్డు చూపించకుండా నిండుగా ఉన్న ఈ స్టార్ ను చూశారా?
అయితే ఈమె కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోలేదు. నటిగా తన సత్తా చాటేందుకు ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధం అవుతుంది. అందుకే ఈమధ్య ఈమెకు ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలైన తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘విడాముయార్చి’ చిత్రం లో విలన్ గా నటించిన ఈమె, రీసెంట్ గా విడుదలైన జాట్ లో కూడా విలన్ క్యారక్టర్ లో మెరిసింది. ఈ రెండు సినిమాలు కాకుండా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి చాప్టర్ 2’ లో ఒక మంచి క్యారక్టర్ చేసింది. ఇలా విలక్షమైన రోల్స్ చేస్తూ లేడీ విజయ్ సేతుపతి అని అనిపించుకుంటుంది రెజీనా. రీసెంట్ గానే ఈమె బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఈటీవీ లో ప్రతీ బుధ, గురువారాల్లో ప్రసారమయ్యే ఢీ 20 షోకి ఈమె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.