Kannappa 1st Week Collections: మంచు విష్ణు(Manchu Vishnu) ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప(Kannappa Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై పర్లేదు, బాగుంది అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంటే మొదటి నుండి ఈ చిత్రం పై ఆడియన్స్ లో సరైన అభిప్రాయం లేదు. ఎందుకంటే మంచు విష్ణు హీరో కాబట్టి. ప్రభాస్(Rebel Star Prabhas) లాంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రం లో ఉన్నప్పటికీ, అనవసరంగా ఒప్పుకున్నారు, వాళ్ళ పరువు పోతుంది అనుకునేవాళ్లు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సెకండ్ హాఫ్ సినిమా చాలా బాగుండడం వల్ల డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. కానీ వర్కింగ్ డేస్ లో మాత్రం భారీ నుండి అతి భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఏ కోణంలోనూ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కిన్ అందుకుంటుంది అనే నమ్మకాన్ని కలిగించలేదు. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో వివరంగా చూద్దాము.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 7వ రోజు 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. అదే విధంగా కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఇతర భాషలకు కలిపి 4 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో రెండు కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదటి వారం 22 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 43 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో కచ్చితంగా 50 కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అందుకోబోతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే నైజాం లో 6 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, సీడెడ్ లో 2 కోట్ల 37 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో సీడెడ్ లో మూడు కోట్ల రూపాయిల షేర్ మార్కుని, నైజాం లో 8 కోట్ల షేర్ మార్కుని ఈ చిత్రం దాటే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొదటి వారం ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 17 లక్షలు, వెస్ట్ గోదావరి లో 82 లక్షలు, గుంటూరు జిల్లాలో 86 లక్షలు, కృష్ణ జిల్లాలో 78 లక్షలు, నెల్లూరు జిల్లాలో 75 లక్షల రూపాయిలు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 58 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.